తెలంగాణా ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం ; బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అలీజాపూర్ శ్రీనివాస్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 13 : తెలంగాణా ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని ప్రజాసంక్షేమాన్ని మరచిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అలీజాపూర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల మానిఫెస్టోలో ఇచిన హామీలైన మూడు ఎకరాల భూమి, డబల్ బెదురూమ్ ఇండ్లు తదితర హామీలను పూర్తిగా మరిచి కేవలం ఓటు బ్యాంకు కోసం గొర్రెలు, చీరలు పథకాలను తెరపైకి తీసుకవచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని, బంగారు తెలంగాణాని రైతుల అవస్థల తెలంగాణగా మార్చారని అన్నారు. ఇతర పార్టీల నాయకులను భయ భ్రాంతులకు గురి చేసి తన పార్టీలోకి తీసుకోని అనైతిక పాలనా సాగిస్తున్నారని అన్నారు.రాబోయే ఎన్నికలకు సిద్ధంకావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. బూత్ లెవెల్ మూర్ఛలు నిర్వహించాలని, ప్రజల సమస్యలను అధికారులదృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే టట్లు చూడాలని కోరారు. పలు కేంద్రపథకాలను తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని, ఉదాహరణకు కేంద్ర పథకమైన ప్రసూతి మహిళా కార్యక్రమంలో అధికభాగం కేంద్రం భరిస్తుంటే కెసిఆర్ కిట్ అని రాష్ట్ర పథకంకింద ప్రచారం చేసుకున్నారని అన్నారు. అన్నపూర్ణ శాంతి కూమర్ గౌడ్. కోరల రాజేందర్. ఆధ్వర్యంలో 150 మంది యువకులు. ఫెద్దలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి చాడ శ్రీనివాస రెడ్డి, జిల్లా అధ్యక్షులు జేబీ పౌడెల్ ,జిల్లా సంఘటన మోర్చా సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్, విజయ్ సింగ్, చర్ల మురళి, ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, రెబ్బెన మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, అసిఫాబా మండల అధ్యక్షులు ఖాండ్రే విశాల్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎలమంచిలి సునీల్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్రాజు రాంబాబు, పసుపులేటి మల్లేష్, మధుకర్, బీజేవైఎం మండల అధ్యక్షులు ఇగురాపు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment