Tuesday, 28 November 2017

ఆంధ్రా బ్యాంకు 95 వ వ్యవస్థాపక దినోత్సవం

ఆంధ్రా  బ్యాంకు 95 వ వ్యవస్థాపక దినోత్సవం 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 28 :   రెబ్బెన మండల కేంద్రంలో ని ఆంద్ర బ్యాంకు లో బ్యాంకు 95వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా సోమవారం జరుపుకున్నారు. బ్యాంకు వ్యవస్థాపకులైన స్వర్గీయ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ నీలం రమేష్ మాట్లాడుతూ మహోన్నతుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య  చిన్నగా స్థాపించిన బ్యాంకు ఈ రోజు   సుమారు మూడువేల శాఖలతో దినదినాభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని ఖాతాదారులకు మరింత నాణ్యమైన సేవలను అందిస్తామని అన్నారు. ఖాతాదారులు ఎక్కువగా నగదురహిత లావాదేవీలపై ద్రుష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ శ్యామ్ సుందర్, సిబ్బంది లక్ష్మి, గబ్బర్సింగ్, ఖాతాదారులు బాల్కర్ ,పోషయ్య, శ్రవణ్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment