అక్రమ అరెస్టులకు వ్యతిరేకముగా ధర్నా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 08 : అధికారంలోకి రావడానికి ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీని నెరవేర్చాలని చలో అసెంబ్లీ నినాదంతో అసెంబ్లీకి తరలి వెళ్తున్న బీజేపీ నాయకులను ఎక్కడికక్కడే అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూబుధవారంనాడు బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి గత నులభై నెలలుగా కేవలం తన ఇంట్లో నాలుగు ఉద్యోగాలు కల్పించి తెలంగాణ ప్రజలను ముఖ్యంగా తెలంగాణయువతను మభ్య పెడుతున్న కెసిఆర్ కు రానున్న ఎన్నికలలో గద్దెదించి బుద్ధి చెప్పాలని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించకపోతే రాబోయే రోజులలో బీజేపీ, బీజేవైఎం ఆధ్య్వర్యంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురాపు సంజీవ్, మండల బీజేపీ అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, ఉపాధ్యక్షులు పూదరి రమేష్, బీజేవైఎం కార్యదర్శి అజ్మీరా ప్రశాంత్, జిల్లా కిసంమోర్చా అధ్యక్షులు సునీల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment