తెరాస కార్యకర్తలకే డబల్ బెడ్ రూమ్ పథకమా: బీజేపీ జిల్లా అధ్యక్షులు జేబి పౌడెల్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 15 : ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవలక్ష్మి తెరాస కార్యకర్తలకే డబుల్ బెడిరూం ఇండ్లు ఇస్తామని బిజెపి జెండా పట్టుకున్న వాళ్లకి ఇవ్వనని వాంకిడి లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో అనటం సబబు కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జెపి పడేల్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడారు డబల్ బెడ్ రూములు కాలనీకు కెసిఆర్ కాలనీ అని పేరు పెట్టటం పట్ల మేము ఊరుకోమని కేంద్ర ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు ఎన్నో నిధులు ప్రధాని నరేంద్రమోడీ కేటాయిస్తున్నారని ఆ విషయాలను బయట పెట్టకుండా మేమే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలకు తెలుసు ఆ ప్రజలే నిర్ణయిస్తారు రెండు వేల పందొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో బిజెపి పై స్థానంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని ఎదుర్కోలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ సుధాకర్ అసెంబ్లీ కన్వీనర్ గుల్మం చక్రపాణి సుదర్శన్ గౌడ్, సంతోష్, రాజేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment