ఫీజ్ రేయింబర్సమెంట్ ని వెంటనే విడుదల చేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 15 : ఫీజురీఎంబర్స్మెంట్ ని వెంటనే అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లాహూ కుమార్ అన్నారు బుధవారం ఆసిఫాబాద్లోని శ్రీ చైతన్య జూనియర్ డిగ్రీ కళాశాలల్లో కరపత్రాలను విడుదల చేసి అనంతరం మాట్లాడారు. స్కాలర్షిప్ రేయింబర్సుమెంట్ ను వెంటనే ప్రభుత్వం విడుదల విడుదల చేయాలని స్కాలర్షిప్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క్రిష్నయ్య పిలుపు మేరకు విద్యార్థులు ఎదుర్కొటు న్న సమస్యలపై పోరాటాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్, వెంకటేశ్, స్వాతి, సంధ్య, మహేష్, అశ్విని తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment