Sunday, 12 November 2017

సీఎం నిర్ణయాలతో మైనార్టీలకు అభివృద్ధి

సీఎం నిర్ణయాలతో మైనార్టీలకు అభివృద్ధి 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 12 :  ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో ప్రకటించిన నిర్ణయాలతో మైనార్టీలకు అభివృద్ధికి దోహదపడతాయని రెబ్బెన మండల కో ఆప్షన్ సభ్యులు ఎంఏ జాకీర్ ఉస్మాని అన్నారు ఆదివారం రెబ్బెన లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని అలాగే  బ్యాంకులతో అనుసంధానం లేకుండా రెండు లక్షల రూపాయల రుణం ఇవ్వడం తో పాటు హిమామ్ మాజిన్ గౌరవ వేతనం వెయ్యి రూపాయలు ఇవ్వడం, తొమ్మిదొందల వృద్ధి ఉపాధ్యాయుల దేశానికి వేమన నియామకానికి ప్రత్యేక టీఆర్టీ నిర్వహిస్తామని బడ్జెట్తో సంబంధం లేకుండా మైనార్టీకి అవసరమైన వరాలను సీఎం కురిపిస్తున్నారని ప్రతి జిల్లా కార్యాలయాల్లో ఉరుదు అనువాదకులను ట్రాన్స్లేట్ నియమిస్తామని అసెంబ్లీలో ప్రకటించడం పట్ల మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తే చేశారు ఏ ప్రభుత్వం   మైనార్టీలకు చేయని అభివృద్ధి పనులను సీఎం కెసిఆర్  చేయడం అభినందనీయం అని అన్నారు. జాతీయ రాష్ట్రస్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు  ఉర్దు భాషలో నిర్వహిస్తామని చెప్పడం స్వాగతించదగ్గ విషయం అని అన్నారు. త్వరలోనే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాయని అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అక్ర జలి జహురుద్దిన్ అలీఫ్ జహీర్ బాబా ఖాదిర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment