గ్రంధాలయ వారోత్సవాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : గ్రంథాలయ నూటయాభయ్యవ వారోత్సవాలను పురస్కరించుకొని రెబ్బెన మండల కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించనున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం గ్రంథాలయాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి ముగింపు సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు
No comments:
Post a Comment