దివ్యంగులకు ప్రోత్సాహం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 16 : జిల్లాలో ఉన్న దివ్యాంగ బధిర అంధ విద్యార్థులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె సావిత్రి ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. తాము అందరితో సమానమే అన్న సంకల్పం వారిలో కల్పించేందుకు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం ఆలోచించి వారిని ప్రోత్సహించేందుకు ల్యాప్ టాప్లు,స్మార్ట్ ఫోన్లు, అదే విధంగా త్రిచక్ర సైకిల్స్ ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ పథకాలకు జిల్లాలోని డిగ్రీ ఆ పైన చదువుతున్న వికలాంగ అంధ బధిర విద్యార్థులు మాత్రమే అర్హులని ఆమె తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఈ నెల 24 తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకోసం www.tvcc.telangana.gov.in, www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ లను చూడవచ్చునని అన్నారు.
No comments:
Post a Comment