Monday, 13 November 2017

ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షర అభిమాన్ పోస్టర్ విడుదల

ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షర  అభిమాన్ పోస్టర్ విడుదల 

     కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 13 :   ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షర  అభిమాన్  కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పాలన అధికారి ఎం చంపాలాల్ పోస్టర్ ను విడుదల చేశారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ  సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో కంప్యూటర్ స్మార్ట్ఫోన్ ఇంటర్నెట్ వాడకం డిజిటల్ చెల్లింపుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు,పధ్నాలుగు నుండి పదహారు వయస్సు గల వారు ఈ శిక్షణ తరగతుల్లో నేర్చుకోవచ్చన్నారు ఆన్లైన్ ద్వారా కరెంట్ వాటర్ మిగతా బిల్లులు కొరకు లైన్లో నిలబడి అవసరం లేకుండానే ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా అన్ని ప్రభుత్వ బిల్లులు సకాలంలో చెల్లించుకోవచ్చన్నారు అలాగే కొనుగోలు చెల్లింపులు కూర్చున్న చోట లిఫ్ట్ ఆఫ్ లోడ్ సరుకులు డౌన్లోడ్ ఈ మెయిల్ ఉపయోగం వాడకం సులభంగా  ఉంటుందన్నారు కామన్ సెంటర్లలో ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని మన జిల్లాలో ఇప్పటికే  నాలుగు వందల డెబ్బై నాలుగు మంది రిజిస్ట్రేషన్ అవ్వగా ఇంకా ఒక వెయ్యి మూడు వందల మంది కి  ట్రైనింగ్ కొనసాగుతుందని నాలుగు వందల మంది సర్టిఫైడ్ అయ్యారని రాష్ట్రంలో మన జిల్లా నిర్వాసిత స్థానంలో ఉందన్నారు మన జిల్లా ఇంకా ముందు స్థానానికి వెళ్లేందుకు విద్యాశాఖ  పంచాయతీ శాఖ వారు  సహకరించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఓ కృష్ణయ్య  జిల్లా మేనేజర్ గౌతంరాజ్ జిల్లా కో ఆర్డినేటర్ రాహుల్ రాజ్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment