నేటి బాలలే రేపటి దెశ దిశా నిర్దేశకులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 14 : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి టౌన్ షిప్ సింగరేణి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని ఏరియా డీజీఎం పర్సనల్ కిరణ్ తెలిపారు జవహర్ లాల్ నెహ్రు జయంతి సంధర్బంగా బాలల దినోత్సవాన్ని పాఠశాల యందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్ ఓ టు జీఎం కే కొండయ్య హాజరయ్యారు. సింగరేణి పాఠశాలా ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ చా చా నెహ్రు కు పిల్లలంటే ప్రేమ అని అందుకే ఆయన జన్మదినాన్ని పిల్లల దినోత్సవం గ జరుపుకుంటున్నామని, అన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా 13 నాడు జరిగి పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి పోరాడనం జరిగింది. ఈ కార్యక్రమంలో డి వై ఫై ఎం లు సుదర్శన్, రాజేశ్వర్, శ్రీనివాస్ రావు,పి ఈ టి భాస్కర్, రెబ్బెన జడ్పీహెష్ ఎస్ ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment