Saturday, 11 November 2017

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 11 :  రాబోయె  ఎన్నికల్లో బీజేపి పార్టీ గెలుపే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని  కొమురంభీం  జిల్లా అధ్యక్షుడు జెబి పౌడెల్ అన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశాలు రెబ్బెన మండల కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా అల్జాపూర్ శ్రీనివాస్, చాలా శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు అని తెలిపారు. ఈ సందర్బంగా జేబీ  పౌడెల్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా నిజం నవాబు ను పొగడడం కేవలం ఓట్ల     కోసమేనని అన్నారు. నిజాం ప్రభువు గొప్పవాడయితే కొమురం భీం పోరాడవలసిన అవసరమేమున్నదని ఆనాడు.  తెలంగాణకోసం విద్యార్థులు అమరులు కావాల్సిన అవారమేమున్నదని అన్నారు. కెసిఆర్  కుటుంబ పాలనకోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని , రాబోయే ఎన్నికలలో బీజేపీని గెలిపించి కేసీఆర్ కు తగిన బుద్ధిచెప్పాలని అన్నారు . ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ, కిసంమోర్చా అధ్యక్షులు సునీల్ చౌదరి, బీజేవైఎం ప్రధానకార్యదర్శి  రాజేష్, నాయకుల మాలిక్, సుదర్శణగౌడ్, కనకయ్య, సురేష్  తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment