సెర్ప్ ఉద్యోగుల 32 వ రోజు సమ్మెలో అరగుండు నిరసన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 30 : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డీఆర్‌డీవో, సెర్ప్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరింది.. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట అరగుండు చేయించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ పార్టీలకు,సంఘాలకు చెందిన నాయకులూ సంఘీభావం తెలిపిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో జాడి వేణుగోపాల్, కుర్ర రమేష్, ఎం పోచాలు , బి సరోజ, అశోక్, కౌసల్య ,ఇందిర, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment