ఆసుపత్రిలో ఇంజక్షన్ గది ఏర్పాటు చెయాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) నవంబర్ 02 : స్థానిక ప్రభుత్వాసుపత్రి లో ఇంజక్షన్ గది ఏర్పాటుచేయాలని బీజేపీ మండల అధ్యక్షులు ఖాంద్రే విశాల్ డిమాండ్ చేసారు. గురువారంనాడు బీజేపీ మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఇంజెక్షన్ గది లేకపోవడంతో మహిళా రోగులులకు అందరి యెదుటనే ఇంజెక్షన్లు ఇస్తున్నారని ఇది మహిళలకు ఇబ్బందికర పరిస్థితి అన్నారు. ఈ విషయంమై గతంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేసిన కూడా పఃలితంలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల, లక్సమం, విలాస్, పవన్ సింగ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment