రేషన్ షాప్ డీలర్ల లిఫ్టింగ్ బంద్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) నవంబర్ 02 : రేషన్ షాప్ డీలర్ల ఆందోళనలో భాగంగా రేషన్ షాప్ డీలర్లు లిఫ్టింగ్ బంద్ పాటిస్తున్నారు.. ఆసిఫాబాద్ కొమురం భీం జిల్ల కాగజ్ నగర్లోని గోదాం దగ్గర జరిగిన కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా దుకాణాల సంఘం అధ్యక్షులు రేగుంట కేశవరావు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకై ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు . ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు కమిషన్ పెంచకుండా, ఉద్యోగభద్రత కల్పించకుండ,పేదప్రజలకు అండగా ఉన్న వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేదిశగా నగదు బదిలీ వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోనేరు శేషగిరి రావు, ఉపాధ్యక్షులు అసెంబీన్ పాటి ,పైడి పురుషోత్తం, తణుకు తిరుపతి, శంకరయ్య, రామయ్య, శంకర్లల్ జైస్వాల్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment