Friday, 17 November 2017

డ్రిప్ ఇరిగేషన్ పద్దతి మేలు: జిల్లా ఉద్యానవన అధికారి

డ్రిప్ ఇరిగేషన్ పద్దతి మేలు: జిల్లా ఉద్యానవన అధికారి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 :  డ్రిప్ ఇరిగేషన్ పద్దతి  ద్వారా ఉద్యానవన పంటల సాగులో ఆశించిన  ఫలితాలు రాబట్టవచ్చని   జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అభివృద్ధి  సంస్థ అధికారి మెహర్ భాష అన్నారు.  శుక్రవారం రెబ్బెన మండలం  గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల  రైతుల ఉద్యానవన  తోటలలో డ్రిప్ ఇరిగేషన్  పథకం పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  రైతులతో మాట్లాడుతూ డ్రిప్ పరికరాలు  ఏర్పాటులో సంబంధిత డీలర్లు పనులు సక్రమంగా నిర్వహించారా లేదా అడిగి తెలుసుకున్నారు.  స్వయంగా డ్రిప్ ఏర్పాటు తీరును మరియు  పనిచేస్తున్న విధానాన్ని పరిశీలించి రైతులకు డ్రిప్ ఇరిగేషన్  పై    అవగాహన ఉందా లేదా అని  అడిగి తెలుసుకొన్నారు. రైతులు డ్రిప్పు ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి  తీసుకు రావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఈ పద్దతిని  ఏర్పాటు చేసుకొని మంచిఫలితాలు సాధించారన్నారు.  వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా రైతులు సైతం ముందుకు వస్తే తాము ట్రిపుల్ సిస్టమ్  మంజూరుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఉద్యానవన పంటలపై  రైతులు ఆసక్తి పెంపొందించుకుని వాటిని సద్వినియోగపరచుకొంటే  దీర్ఘకాలికంగా ఆదాయం పొందే అవకాశముందన్నారు ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా ఉద్యానవన అధికారి నదీమ్ కోర్డినేటర్ ఉన్నారు.

No comments:

Post a Comment