Wednesday, 15 November 2017

తెలంగాణ సమగ్రాభివృద్దే సి పి ఐ ఎజెండా ; సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి కెసిఆర్ కుటుంబపాలన నుండి తెలంగాణను రక్షించుకుందాం

తెలంగాణ సమగ్రాభివృద్దే సి పి ఐ  ఎజెండా ; సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి 
  •  కెసిఆర్ కుటుంబపాలన నుండి తెలంగాణను రక్షించుకుందాం 



  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 15 :  తెలంగాణ సమగ్రాభివృద్దే సి పి ఐ  ఎజెండా అని సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు.  సామజిక తెలంగాణా సమగ్రాభివృద్ధికై  సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి నాయకత్వాన  అక్టోబర్  6 నుండి డిసెంబర్ 3 వరకు సి పి ఐ  చేపట్టిన పోరుబాట యాత్ర  లో భాగంగా బుధవారం కొమురంభీం జిల్లా రెబ్బెనకు చేరుకున్న చాడ వేంకటరెడ్డి మాట్లాడుతూ సకలజనులు ప్రాణాలకు తెగించి కోట్లాడి  సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి,చేసిన హామీలను మరచి,లక్ష ఉద్యోగాలనిచెప్పి, తన కుటుంబపాలన సాగిస్తున్నకెసిఆర్ కు తగిన బుడ్డి చెప్పాల్సిన సమయం వచ్చిందని  రాబోయే ఎన్నికలలో కెసిఆర్ ను గద్దెదింపి తెలంగాణను రక్షించుకుందామని  అన్నారు. తమ న్యాయమైన కోరికలకు ఉద్యమాలు చేస్తున్న వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్త్రికరిస్తున్నారని, దళితులకు మూడు ఎకరాలని  ,కేజీ  టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగమని,పంటల నష్టపరిహారమని, చెప్పి ఇపుడు ఆ విషయమే మరిచి ప్రజల దృష్టిని మరల్చడానికి గొర్రెలని, బర్రెలని కల్లబొల్లి మాటలు చెపుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలు పెద్ద  స్కాములని  అన్నారు. రేషన్ షాపులవ్యవస్థను   నిర్వీర్యపరచి పేదలకందే బియ్యాన్ని అందకుండా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ శాసనసభ్యులు గుండా మల్లేష్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్, పశ్యపద్మ, ఎఐవైఏఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు యాదవ్, కార్యదర్శి అనిల్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు తిరుపతి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జగ్గయ్య,శంకర్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయి,మండల అధ్యక్షుడు మహిపాల్, కార్యదర్శి పర్వతి సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment