ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి ; జిల్లా పాలనాధికారి చంపాలాల్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 20 : ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలనీ జిల్లా పాలనాధికారి చంపాలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొమురం భీం . జిల్లా పాలనాధికారి కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యల పరిష్కారానికై జిల్లా పాలనాధికారిని కోరారు. అన్నం దారి విజయ ,బాలాజీ నగర్, ఆసిఫాబాద్ నివాసి తన అర్జీలో తనకు మీ సేవ లేదా ఈ సేవ మంజూరు చేయాలనీ, చిన్న లింగాపూర్ మండలం ఆసిఫాబాద్ నివాసి సబ్ ప్లాన్ కింద మంజూరైన డీజిల్ ఆటోసబ్సిడీ మంజూరు కొరకు, రాథోడ్ ప్రకాష్ ధనోరా మండలం వాసి భూ సర్వే నిలిపివేయాలని , సిద్ధం దేవరం వాంకిడి మండలం తన భూమి సరిహద్దులు మార్చివేసి ఆక్రమించారని ,న్యాయం చేయాలనీ, నిర్మల వాంకిడి మండలం ఫించన్ ఇప్పించాలని కోరారు. మొత్తం 85 దరఖాస్తులు అందాయని అధికారులు ప్రజల ఫిర్యాదులపై సత్వరమే విచారణ జరిపి న్యాయం చేయాలనీ పాలనాధికారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శంకర్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment