కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 25 : నిరుద్యోగుల సమరభేరి సభను విజయవంతం చేయాలని బీజేవైఎం మండలాధ్యక్షుడు ఖాంద్రే విశాల్ అన్నారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26తేదీన హైదరాబాద్ లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం పేర కేవలం హామీలకే పరిమితం చేసి నీటిమీద రాతలు చేశారన్నారు. గత నెల 30న బీజేవైఎం ఆధ్వర్యంలో చలో అసెంబ్లీని చేపట్టగా దానిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుని బీజేవైఎం కార్యకర్తలను మరియు నిరుద్యోగులను ఎక్కడికక్కడే అరెస్టులు చేసి నిర్బంధం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం లక్ష ఉద్యోగాల చొప్పున ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, బిజెపి బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేసరి ఆంజినేయ గౌడ్ , బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు క్రిష్ణకుమారి, బిజెపి రెబ్బెన మండల అధ్యక్షుడు కుందారపుబాలకృష్ణ, బీజేవైఎం మండలాధ్యక్షుడు ఇగురపు సంజయ్ , బిజేవైయం అసిఫాబాద్ పట్టణ అధ్యక్షుడు బి సాయితేజ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment