కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 11 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో పూర్తిస్థాయి ఫీజు కల్పించాలని ఈ రోజు కగజ్ నగర్ లో టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా కమిటీ అద్వ్యారంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.తెలంగాణా రాష్ట్రంలో ని కొన్ని జిల్లాలో జర్నలిస్ట్ పిల్లలకు పూర్తిస్థాయి ఫీజు రాయితీ కల్పిస్తున్నారని మన జిల్లాలో కూడా వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని కోరారు .డిప్యూటీ సీఎం స్పందించి తప్పకుండ ఫీజు రాయితీ పై అధికారులను అదేశిస్తానన్నారు..ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహేమన్, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ జమీల్, కోశాధికారి అడప సతీష్, అక్రి డేషన్ కమిటీ మెంబర్ ఈ ప్రకాష్ గౌడ్, జర్నలిస్ట్ లు గంధం శ్రీను, మెహరాజ్, నూర్ ఖాన్, చారి, షఫిఉల్లా, శ్రీను, రాజు పలువురు ఉన్నారు.
No comments:
Post a Comment