Sunday, 5 November 2017

స్వేరో ఒలింపిక్స్ సన్నాహక 2 కే రన్

 స్వేరో ఒలింపిక్స్ సన్నాహక  2 కే  రన్



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 04 : హైద్రాబబులో నవంబర్ 6 నుండి 9 వరకు లాల్ టెఖీఢీ యందు జరగనున్న 3వ స్వేరో ఒలింపిక్స్ ను పురస్కరించుకునిఆసిఫాబాద్ యందు స్వేరో జిల్లా శాఖ ఆద్వర్యం లో  2 కే  రన్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి  ముఖ్య అతిథి గా హాజరు ఐన స్వేరో రాష్ట్ర అధ్యక్షులు కాంపెల్లి ఊశన్నా స్వేరో జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ స్వేరో సంస్కృతి లో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఉందని, ఆరోగ్యం గా ఉన్న వారు    అధిక జ్ఞానమును సంపాదించుకోగలరాని , తద్వారా జ్ఞాన సమాజ నిర్మాణంలో ఎక్కువగా పాల్గొనగలడని తెలిపారు ఈ కార్యక్రమం లో స్వేరో జిల్లా అధ్యక్షులు హేమంత్ షిండే, కోశాధికారి చైతన్య, ఉపాధ్యక్షులు ఆత్మ రావ్, ఆసిఫాబాద్ మండల స్వేరో బాధ్యులు వెంకటేష్, మారుతి, శిరీష్, చంద్ర శేఖర్,  గిరిజన సంక్షేమ గురుకులా ల డి సి ఓ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ డా. కె .రాజారాం ,ఉప్పలఁయ్య మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకులాల జూనియర్ స్వేరోలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు.

No comments:

Post a Comment