ప్రజలు తమ సమస్యలను సాధ్యమైనంతవరకు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 15 : సమస్యలను సామరస్య పూర్వకం గా, శాంతియుత వాతావరణం లో పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో జిల్లా ఎస్పి అద్యక్షతన నెల వారి నేర సమీక్షా సమావేశం ను నిర్వహించి జిల్లా లోని పోలీస్ స్టేషన్ ల లో ఉన్నటువంటి పెండింగ్ కేసు ల వివరాలను గురించి ,హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి పెండింగ్ లో వున్నా కేసుల గురించి మరియు జిల్లా లో నమోదు అయిన పెట్టి కేసుల గురించి జిల్లా ఎస్పి పరిశీలించారు, జిల్లా లోని గ్రేవ్ కేసు ల పురోగతి కు నిరూపణ కు తిసుకోవలిసిన జాగ్రత్తలను, పొందుపరిచే పద్దతులను గురించి స్టేషన్ హౌస్ అధికారులకు జిల్లా ఎస్పి వివరించారు, కేసులు నమోదు చేసిన తరువాత స్టేషన్ హౌస్ అధికారులు విధి గా బాధితులకు FIR కాపీ లను అందించాలని జిల్లా ఎస్పి అధికారులను ఆదేశించారు,స్టేషన్ నిర్వహణకు జిల్లా లో ప్రవేశ పెట్టిన “5S” విదానం పైన పోలీస్ స్టేషన్ ల లో సార్టింగ్ ను ప్రధానం గా తనిఖి లు ఉంటాయని , అంతే కాక స్టేషన్ ల నందు నిర్దిష్టమైన పార్కింగ్ ప్రాంతాలలోనే పద్ధతి గా సిబ్బంది మరియు విజిటర్స్ కూడా పార్క్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విధి గా ప్రతి శుక్రవారం పెరేడ్ ,శనివారం స్వచ్ పోలీస్ స్టేషన్ ను నిర్వహించాలి అని పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బతీసేలా వుండే నిర్మాణముల పట్ల జాగ్రత్త వహించాని జిల్లా ఎస్పి తెలిపారు. రానున్న రోజులలో సబ్ డివిజన్ ల వారిగా క్రావ్ మాగా (స్వీయ ఆత్మ రక్షణ )శిక్షణ ను జిల్లా లో ఏర్పాటు చేస్తామని ఎస్పి తెలిపారు , జిల్లా లో ఎక్కువగా నగదు లావాదేవీలు నిర్వహించే వ్యాపార సంస్థలు సి సి కెమెరా లు ఏర్పాటు చేసుకునేలా వారికి అవగాహన కలిపించాలి అని తెలిపారు , అంతరాష్ట దొంగల ముఠాలు జిల్లా లోకి ప్రవేశించకుండా నిరంతర గస్తి తో అప్రమత్తం గా వుండాలని , జిల్లా లో అనుమానితులు , అపరిచితులు మరియు అక్రమము గా జిల్లా లో ప్రవేశించే వారి యొక్క సమాచారం ను నేరుగా జిల్లా ఎస్పి కు గాని స్థానిక పోలీస్ లకు గాని తెలుపవచ్చు అని జిల్లా ఎస్పి తెలిపారు, జిల్లా లోని కొన్ని ప్రాంతాలలో నూటనలభైనాలుగు సెక్షన్ అమలు లో ఉన్నందున ఎటువంటి ర్యాలి లకు ,ధర్నాలకు అనుమతులు లేకుండా నిర్వహించరాదని , నిర్వహించిన చట్ట రిత్య చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి స్పష్టం చేశారు, ప్రజలు కూడా పోలీస్ లకు సహకరించి శాంతి స్తాపనకు కృషి చేయాలని ఈ సందర్బంగా జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ కోరారు. ఈ కార్యకమం లో జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్ గోద్రు, ఆసిఫాబాద్ డిఎస్పి.సత్యనారాయణ, కాగజ్ నగర్ డిఎస్పి సాంబయ్య, డిఎస్పి , ఎస్పి సిసి దుర్గం శ్రీనివాస్,డి.సి.ఆర్.బి ఎస్సై రాణా ప్రతాప్, ఎన్.ఐ.బి ఇంచార్జ్ శ్యాం సుందర్, ఐటి కోర్ ఇంచార్జ్ జే.శ్రీనివాస్, ఇ.విజయ్ లాల్, పీ.ఆర్.ఓ మనోహర్ మరియు జిల్లా లోని ఎస్సైలు సిఐ లు పాల్గొన్నారు. జిల్లా లో సిసిటిఎన్ఎస్ నమోదు నందు ప్రతిభ కనబరిచిన ఆసిఫాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఆత్రం బాపు రావు పీ సి 3160 ను నెల వారి నేర సమీక్షా సమావేశం లో జిల్లా ఎస్పి నగదు ప్రోత్సహం అందించి అబినందించారు ఇక పైన కూడాసి సిటిఎన్ఎస్ లో కూడా ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరికి ప్రోత్సహకాలు అందిస్తామని జిల్లా ఎస్పి తెలిపారు.
No comments:
Post a Comment