Saturday, 11 November 2017

అభివ్రుద్దే తెలంగాణ ప్రభుత్వ అజండా ; ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి సిర్పూర్లో నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించిన కడియం

అభివ్రుద్దే  తెలంగాణ ప్రభుత్వ అజండా ; ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి

సిర్పూర్లో నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించిన కడియం



   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 11 :    అభివ్రుద్దే  తెలంగాణ ప్రభుత్వ అజండా ;అని  గతంలో ఏ  ప్రభుత్వం చేయని విధంగా కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం విద్య,ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టి అన్ని వసతు లు కల్పిస్తున్నదని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం  కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన  ప్రభుత్వ జూనియర్ కళాశాల  నూతన భవనాన్ని ప్రారంభించారు.   అనంతరం పలు అభివృద్ధి  కార్యక్రమాలలో పాల్గొన్నారు.    . సిర్పూర్ నియూజకవర్గం కాగజ్ నగర్లో    ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో శ్రీఉషా ఫౌండేషన్ ద్వారా 52 డిజిటల్ టీవీలను అందించి  డిజిటల్ క్లాసులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. నియోజకవర్గంలో .  ప్రబుత్వ జూనియర్ కళాశాలల్లో  2500 మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజన కారియక్రమం, పథకాన్ని ప్రారంభించారు.  8500  స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేసారు. .అంతకు ముందు రైలులోకాగజ్ నగర్ చేరుకున్నఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరికి సిర్పూర్ ఎం ఎల్ ఏ  కోనేరుకోనప్ప ఘనస్వాగతం పలికారు.  పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.  ఈ   .కార్యక్రమం లొ మ౦త్రి జోగు రామన్న, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరన్ రెడ్డి, ఎ౦పీ గడె౦ నగేష్, స్తానిక ఎ౦ఎల్ఏ కొనెరు కొనప్ప.నాయకులు విద్యార్దులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

No comments:

Post a Comment