Friday, 24 November 2017

పోలింగ్ ప్రక్రియ పై విద్యార్థులకు అవగహన

పోలింగ్ ప్రక్రియ పై విద్యార్థులకు అవగహన 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 24 : జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా  పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు దాని ప్రాముఖ్యాన్ని  తెలిపరిచేందుకు ఉపాధ్యాయులు మాక్ పోలింగ్ నిర్వహించారు.ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ముఖ్య అతిధిగా రెబ్బెన మండల  ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్  హాజరు అయ్యారు. ఆయన  మాట్లాడుతూ దేశంలోని ప్రజలకు అన్ని హక్కుల కంటే కూడ ఓటు హాక్కు చాల ప్రాధాన్యమైందని అన్నారు. ప్రజాస్వామ్యమైన దేశంలో స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవచ్చని, దేశ భవిష్యత్తు ఓటర్లపై ఆదారపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు వివరిస్తూ బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు చేపట్టారు.కాగా విద్యార్థులే ఎన్నికల అధికారులుగా, ఏజెంట్లుగా, పోలింగ్  రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌, దరఖాస్తుల (నామినేషన్) స్వీకరణ, ఉపసంహరణ, స్క్రుటిని, పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, ఓటింగ్‌ ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అనంతరం అభ్యర్థుల గుర్తులతో కూడిన బ్యాలెట్‌, చూపుడు వేలుకు సిరా అంటించడం, నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి బ్యాలెట్‌ బాక్సుల్లో వేసే ప్రక్రియను నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ,ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, మోడెం సుదర్శన్ గౌడ్,  ఎస్ఎంసి అధ్యక్షా, ఉపాధ్యక్షులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment