పంటలకు మద్దతు ధర మరియు సాంకేతిక పరిజ్ఞానం పోస్టర్ల విడుదల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : పంటలకు మద్దతు ధర మరియు సాంకేతిక పరిజ్ఞానం అనే పోస్టర్లను జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ వారి ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానము ప్రవేశపెట్టిందని సరఫరా సంస్థ వారి ఆధ్వర్యంలో ఇందులో భాగంగా కనీస మద్దతు ధరపై రైతుల నుండి కొనుగోలు చేసిన మధ్య యొక్క విలువలను రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సంయుక్త పాలనాధికారి తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తేవాలన్నారు రైతులకు వరిపంట మద్దతు ధర పొందాలంటే కొనుగోలు కేంద్రంలో రైతు వివరాలు నమోదు చేసుకోవాలని ఆధార్ కార్డు గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం భూమి వివరములు బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్సీ కార్డు, జిరాక్స్, మొబైల్ నెంబర్, బ్యాంకు పాసు పుస్తకము అమలులో ఉన్నట్లు బ్యాంకు వారి ద్వారా ధ్రువీకరణ ఇవ్వాలన్నారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త తాలు మెట్ట బెడ్డలు రాళ్లు లేకుండా శుభ్రంగా పరుచుకుని తీసుకురావాలని అన్నారు చెడిపోయిన మొలకెత్తిన పురుగులు తిన్న ధాన్యం నాలుగు శాతం మించకుండా ఉన్న ఉండాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రం వారి తూకం వేసి కనీసం మద్దతు ద్వారా క్వింటళు గ్రేడ్ ఏ రకానికి పదిహేను వందల తొంభై కామన్ రకానికి పదిహేను వందల యాభై చొప్పున రైతు ఖాతాల్లో వెంటనే జమ చేయాలన్నారు రైతు సరైన పద్ధతులు పాటిస్తే మద్దతు ధర పొందడానికి సంయుక్త కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ జిల్లా మేనేజర్ గోపాల్ డిసిఓ రాంబాన్ జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment