పదోన్నతి బాద్యతను మరింత పెంచుతుంది - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 07 : విధి నిర్వహణ లో పదోన్నతి మరింత బాద్యతలను పెంచుతుందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు, పదోన్నతి ఇచ్చిన ఆత్మ విశ్వాసం, నూతన ఉత్తేజం ను ఉపయోగించుకొని పోలీసులు అన్నిటా ఆదర్శం గా ,మార్గనిర్దేశకులు గా ఉండేలా వారి పనితనం వుండాలని జిల్లా ఎస్పి నూతనము గా పదోన్నతి పొందిన ఎస్సై లకు సూచించారు, సోమవారం జిల్లా లోని స్థానిక ఎస్పి క్యాంపు కార్యాలయం లో ఆర్డర్టు టు సర్వ్ పై వచ్చి ఏఎస్సై నుంచి ఎస్సై గా పదోన్నతి పొందిన ఏఎస్సై లు డి.ప్రభాకర్ , షైఖ్ ఖమ్రోద్దిన్ లను జిల్లా ఎస్పి గౌరవపదోన్నతి చిహ్నం అలంకరించి అబినందిచారు. .ఇక పైన కూడా రెట్టింపు విశ్వాసం తో శాంతి భద్రతలను కాపాడాలని తెలిపారు ఈ కార్యక్రమము లో ఎస్పి సీసీ దుర్గం శ్రీనివాస్ , ఎస్బి సీ ఐ సుధాకర్, ఎస్బి ఎసై లు శివకుమార్ , ఎన్.ఐ.బి ఎస్సై శ్యాం సుందర్, డి సి ఆర్ బి ఎస్సై రానా ప్రతాప్ , పోలీస్ ఉన్నత శ్రేణి సహాయకుడు కేదార సూర్యకాంత్, కిరణ్ కుమార్ లు పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment