Saturday, 11 November 2017

కాపు భవనం ఏర్పాటు చేయాలని వినతి

కాపు భవనం ఏర్పాటు చేయాలని వినతి 



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 11 :  రెబ్బెన మండల కేంద్రంలో మున్నూరు కాపు భవన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మున్నూరు కాపు సంఘం నాయకులు అటవిశాఖ మంత్రి జోగురామన్న కు వినతిపత్రాన్ని అందజేశారు.   మున్నూరుకాపు కులస్థులు రెబ్బెన మండల కేంద్రంలో అధిక సంఖ్యలో ఉన్నందున  కొంత స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.   రాష్ట్రంలో మున్నూరు కాపు సంఘం నుండి మొట్టమొదటి మంత్రి వర్యులు   జోగురామన్న  అయినందున వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మహిళా  అధ్యక్షురాలు కొందరు కుందారపు శంకరమ్మ ,యూత్  కార్యదర్శి పూదరి సాయి కిరణ్ యువజన నాయకులు మహిపాల్  తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment