Thursday, 9 November 2017

ప్రభుత్వ భూములను పరిశీలించిన జిల్లా పాలనాధికారి

ప్రభుత్వ భూములను పరిశీలించిన జిల్లా పాలనాధికారి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 09 :  జిల్లాలోని ప్రభుత్వ భూములను జిల్లా పాలనాధికారి గురువారంనాడు పరిశీలించారు. సినిమాటోగ్రఫీ శాఖద్వారా నిర్మించబోయే మల్టీప్లెక్స్ నిర్మాణానికి అనువైన స్థలాన్నిజనాకపూర్  శివారు ప్రాంతంలో పరిశీలించారు .మల్టీప్లెక్స్ నిర్మాణానికి ఒక ఎకరం భూమి అవసరమౌతుంది దీనికి సంబంధించిన నివేదికలను సిద్ధంచేయాలని జిల్లాపాలనాధికారి మండల సర్వేయరుకు ఆదేశించారు. బస్టాండ్ ప్రాంతంలో 66 అడుగుల వెడల్పుతో  అడుగులతో నిర్మిస్తున్న రోడ్ పనులను పరిశీలించారు. ఒక వారంలోగా రోడ్ విస్తరణ పనులకోసంరోడ్డుకి  ఇరువైపులా ఉన్న వ్యాపారసముదాయాలను తొలగించుటకు వ్యాపారస్తులతో మాట్లాడి చెర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి మరియు గ్రామపంచాయితీ సిబ్బందిని ఆదేశించారు. నిర్ణిత గడువులోగా పనులను పూర్తిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రమేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ బక్కయ్య , మండల సర్వేయోర్  , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment