ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 30 : ప్రపంచ తెలుగు మహాసభల కొమురంభీం జిల్లా స్థాయి సన్నాహక సమావేశం జిల్లాపాలనాధికారి చంపాలాల్ ఆధ్వర్యంలో కవులు, కళాకారులతో జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలని, వేడుకలలో పాల్గొనే కవులు , కళాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మహాసభల సందర్భంగా ర్యాలీ, మానవహారం వేడుకలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయి మహాసభల సందర్భంగా డిసెంబర్ 8వ తేదీన విద్యార్థులు, కవులు, కళాకారులతో జిల్లా కేంద్రంలో ర్యాలీ, మానవహారం నిర్వహిస్తామని అన్నారు. జిల్లా స్థాయి ముగింపు వేడుకలు డిసెంబర్ 12 న నిర్వహించాలన్నారు. ఆ రోజు ఉదయం 09. 20 నుండి కవిసమ్మేళనం ఉంటుందని, అనంతరం భోజన విరామం మధ్యాహ్నం 1.00 నుండి 2. 00 వరకు, తరువాత 2.00 నుండి 4,30 వరకు అనంతరం కళాకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, ఏ పి ఆర్ ఓ తిరుమల, కవులు రుద్రాల వెంకటేశ్వర్లు, మాడుగులవెంకటేశ్వర శర్మ, మాడుగుల, ధర్మపురి వెంకటేశ్వర్లు, బిట్ల వెంకటస్వామి, సారధి కళాకారులూ ఇర్ఫాన్, జానపద కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులూ తొగరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment