గిట్టుబాటు ధర రాక రైతుల ఇబ్బందులు ; తెదేపా జిల్లా అధ్యక్షులు ఆనంద్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 08 : తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సంవత్సరం పంటలకు గిట్టుబాటు ధరలేక రైతాంగం అల్లాడిపోతుందని వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పత్తికి సోయాకు గిట్టుబాటు ధర కల్పించాలని తెదేపా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు పత్తికి మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పత్తికి గిట్టుబాటు ధర ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెరాస సర్కారు పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు ఆరుగాలం కష్టపడి పండించే రైతు కంటతడి పెట్టుకోవడం రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు పత్తితో పాటుగా సోయాకు వారికి మంచి ధరలు కల్పించాలని దీన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. టిడిపి రైతుల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని అన్నారు పత్తితో పాటుగా సోయాకు వరికి గిట్టుబాటు ధరలు కల్పించి రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు భువనగిరి మురళి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మారాం, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి సిఎచ్ గణపతి పట్టణ అధ్యక్షులు తాజ్ బాబా , టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి సాయిరాం తెలి యువత జిల్లా నాయకుడు వి వేణు నాయకులు పి.మల్లేష్ ధర్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment