ఆయుర్వేద వైద్య శిబిరం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 15 : బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మాతా రిసెర్చ్ సెంటర్ హైదరాబాద్ డాక్టర్ విశ్వనాథ్ మహర్షి వారి ఆధ్వర్యంలో గోలేటి టౌన్ షిప్లోని సిఇఆర్ క్లబ్ లో గురువారంనాడు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయుర్వేద వైద్య సిబ్బంది శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు. పిత్తం శ్లేష వాతం అనే మూడు ధాతువులు మానవ శరీరాన్ని పుట్టించి పాలించి నాశనం చేస్తున్నాయని ఈ మూడు ధాతువులు మానవ శరీరంలో సమానంగా ఉండడమే ఆరోగ్యమని హెచ్చుతగ్గులుగా ఉంటే అనారోగ్యమని ఈ సిద్ధాంత ప్రాతిపదిక మీదనే ఆయుర్వేదం ఈ లోకంలో అవతరించిందని ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాథ్ మహర్షి గారు తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్లు మోకాళ్ల నొప్పులు బీపీ షుగర్ అజీర్ణము మలబద్ధకము ఆస్తమా స్త్రీల వ్యాధులకు మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గోలేటి టౌన్ షిప్ మరియు మాదారం టౌన్షిప్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్మికులు మాజీ కార్మికులు వారి కుటుంబ సభ్యులు గ్రామ సభ్యులు ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిజిఎం పర్సనల్ జె కిరణ్ కోరారు.
No comments:
Post a Comment