కుష్ఠు వ్యాధి ఫై అవగాహనా సదస్సు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 07 : జాతీయ కుష్ఠు నిర్ములన కార్యక్రమంలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం 2017 భాగంగా రెబ్బెన మండలంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళ వారంనాడు జరిగిన కార్యక్రమంలో వైద్యాధికారిని నాగమణి కుష్టి వ్యాధి ఫై అవగాహనా కల్పించారు అనంతరం మాట్లాడుతూ ఎవరి ఒంటిమీదనైనా తెల్లని,ఎరుపు రంగు , మచ్చలు ఉంది స్పర్శ లేనట్లయితే కుష్ఠు అని అనుమానించాల్సివస్తుందని . ముందుగానే చికిత్స మొదలుపెడితే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు.ఈ విషయంపై సర్పంచులు ఆశా సిబ్బంది, మండలంలోని ప్రజలకు అవగాహనా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగమణి, సూపర్ వైజర్లు పావని, సంతోష్, లెప్రసి కోఆర్డినేటర్ రామకృష్ణ రెడ్డి , కమల్ , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment