Saturday, 11 November 2017

ఆర్యవైశ్య కులస్థులు సామూహిక సత్యనారాయణ వ్రతం

ఆర్యవైశ్య కులస్థులు సామూహిక సత్యనారాయణ వ్రతం 
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 11 :  రెబ్బెన మండలంలోని ఆర్యవైశ్య  కులస్తులు శనివారం గంగాపూర్ శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి     స్వామివారి దేవస్థానం లో  సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించుకున్నారు. ఈ సామూహిక సత్యనారాయణ వ్రతంలో  సుమారు యాభై రెండు జంటలు పాల్గొన్నట్లు తెలిపారు.  వ్రతం అనంతరం భోజనాలు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల కమిటీ ని   ఎన్నుకున్నట్లు తెలిపారు.  అధ్యక్షుడిగా మైలారపు సుగుణాకర్  ఉపాధ్యక్షులుగా జి ప్రకాష్, గుల్బమ్ చక్రపాణి  మరియు జనరల్ సెక్రెటరీగా కొలిపాక కిరన్ కుమార్ మీడియా ప్రతినిధి గ  సిద్ధంశెట్టి  సంతోష్ ను ఎన్నుకున్నారు.  మరియు యువజన సంఘం అధ్యక్షుడిగా యంసాని సతీష్ కుమార్ ను ఉపాధ్యక్షులుగా తనకు రామన్న గోలి వెంకటేష్  లను ఎన్నుకున్నారు. 







No comments:

Post a Comment