Friday, 10 November 2017

కరెంట్ ఉచ్చుతో మృత్యువొడిలోకి యువకుడు

కరెంట్ ఉచ్చుతో  మృత్యువొడిలోకి యువకుడు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 10 : రెబ్బెన మండల కేంద్రం లోని సుబ్ స్టేషన్  వైపు ఉన్నగౌత్రే హనుమంత్ పొలంలో  బొంక ప్రేమ్ కుమార్ ,దౌత్రే భీం రావ్ , ఊరడి పుల్లయ్య ,భూక్యా రమేష్ ,సైదులు మల్లేష్,మహేష్ ,కోట రాజకుమార్ లు అడవీ జంతువుల వేట కోసం కరెంట్ తీగలను గురువారం సుమారు 9 గంటల ప్రాంతంలో పొలం చుట్టు అమర్చి వెళ్లారు మరుసటిరోజు  తెల్లవారుజామున జంతు వేటకు అమర్చిన కరెంటు తీగలను తొలగిసుండగా ప్రమాదశాత్తు విద్యుత్ షాక్ గురై   కోట రాజ్ కుమార్ మార్గం మధ్యలో మృతిచెందాడు.ఈ ఘటనకు సంబంధించి రత్నం శాంతయ్య ఎలక్ట్రికల్ అధికారి ఫిర్యాదు మేరకు  రెబ్బెన ఎస్ ఐ నరేష్ కుమార్, ఆసిఫాబాద్ ఇన్స్పెక్టర్ వినోద్లు  సంఘటాస్థలాన్ని చేరుకొని సంబంధిత వ్యక్తులపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment