కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 10 : నూతన బాద్యత లను ఉత్సాహం గా నిర్వహిస్తూ మెరుగైన పని తీరుతో పోలీస్ శాఖ యొక్క ప్రతిష్ట ను పెంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ను నెలకొల్పేందుకు కృషి చేయాలనీ జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ అన్నారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై నుంచి పదోన్నతి పొందిన నలుగురు పోలీస్ అధికారులను శుక్రవారం జిల్లా లోని స్థానిక ఎస్పి క్యాంపు కార్యాలయం లో కుమ్రం భీమ్ జిల్లా ఎస్పి పదోన్నతి చిహ్నం అయిన నక్షత్రంలను అలంకరించి అభినందిచారు. పదోన్నత్తి పొందిన అధికారులను జిల్లా లోని పలు ప్రాంతాలకు జిల్లా ఎస్పి బదిలీ చేశారు.పదోన్నతి రెట్టించిన విశ్వాసంను ఇస్తుందని, దానికి అనుగుణంగా వీధి నిర్వహణ కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమము లో ఎస్పి సీసీ దుర్గం శ్రీనివాస్ ,ఎస్బి సీ ఐ సుధాకర్, ఎస్బి ఎసై లు శివకుమార్ , ఎన్.ఐ.బి ఎస్సై శ్యాం సుందర్, ఎన్.ఐ.బి ఏఎస్సై రామా రావు , కిరణ్ కుమార్, జిల్లా పాస్ పోర్ట్ అధికారి మురళి మరియు పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment