Monday, 13 November 2017

ఇసుక అక్రమ రవాణా ఆపాలని వినతి.

ఇసుక అక్రమ రవాణా ఆపాలని వినతి. 

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 13 :  ఇసుక అక్రమ రవాణా ఆపడానికి చర్యలు తీసుకోవాలని రెబ్బెన మండలం  లక్ష్మి పురం గ్రామ స్తులు సోమవారంనాడు రెబెనా మండల తహసీల్ధార్కు వినతి పత్రం సమార్పించారు. వినతిపత్రంలో గత సంవత్సర కాలంగా స్థానిక ఇసుక మాఫియా లక్ష్మి పురం వాగు నుండి రాత్రి పగలు అనే తేడాలేకుండా ఇసుకను ట్రాక్టర్లు,లారీల ద్వారా రవాణ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ,అధికారిక నిర్మాణాలకు తీసుకొన్న అనుమతులను సాకుగా చూపి వారి ఇష్టమొచ్చిన రీతిలో ఇసుకను దోచేస్తున్నారు. వాగునుండి ఇసుకను తరలించడంతో నీటి లభ్యత తగ్గిందని వారు వినతి పత్రంలో వివరించారు.  ఈ అక్రమ రవాణాను ఇకనైనా అరికట్టాలని కోరారు.  కార్యక్రమంలో కోవూరు శ్రీనివాస్, ముంజం రవీందర్,  శ్రీనివాస్,  రావుజి ,చౌదరి బాపు రావు, పిప్పారి ధర్మయ్య , చౌదరి నాగయ్య, సావిత్రిబాయి, శంకర్, దేవాజి, గోపాల్, విలాస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment