Sunday, 5 November 2017

చలో ఢిల్లీ గోడప్రతుల విడుదల


చలో ఢిల్లీ గోడప్రతుల విడుదల 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 05 :  అధికధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలని ఏ  ఐ టి యు సీ  సింగరేణి వర్కర్స్ యూనియన్ గోలేటి బ్రాంచ్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటిలో  ఈ నెల 9,10,11 తేదీల్లో పార్లమెంట్ వద్ద తలపెట్టిన మహాధర్న కార్యక్రమానికి సంబంధించిన చలో ఢిల్లీ గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్ళగా ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ,ఫార్మా ఇన్సూరెన్సు  , రక్షణ ,  రంగాలలో విదేశీ  పెట్టుబడులను ఆహ్వానిస్తూ వాటిని విధ్వంసం  చేస్తున్నాదని , 44 కార్మిక చట్టాలను 4 కోడలుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాదని  అన్నారు. అచ్చేదిన్ మాక్ ఇన్ ఇండియా అంటూ 33 శాతం ఓట్లతో  అధికారాలోకివచ్చి  పెద్దనిఓట్లరద్దుఅని సామాన్య ప్రాణాలను ఇబ్బందులలోకి నెట్టివేసిందని అన్నారు. రాష్ట్ర విషయానికివస్తే  కెసిఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం మాయ మాటలతో గారడీ చేస్తున్నాడని అన్నారు. ఈ విషయంపై ఢిల్లీ లో జరిగే మహాధర్నాను విజయవంతం  కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చెల్లూరి అశోక్, మండల కార్యదర్శి రాయల నర్సయ్య, తిరుపతి, దుర్గం తిరుపతి, నాయకలు బి తిరుపతి, సికందర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment