Wednesday, 8 November 2017

పి ఆర్ టి యూ టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కల్వల శంకర్

పి ఆర్ టి యూ టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కల్వల శంకర్
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 08 :  పి ఆర్ టి యూ టిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా  రెబ్బెన మండలం నక్కలగూడ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న కల్వల శంకర్ ను  ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తం రెడ్డి, ప్రధాన  కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి నియమించారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్ప చెప్పినందుకు  సంఘ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని ఆయన అన్నారు ఆయన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా కార్యవర్గలకు ధన్యవాదాలు తెలియజేశారు. శంకర్ ఎన్నిక పట్ల రెబ్బెన  మండల అధ్యక్షులు ఆర్.సత్తన్న, ప్రధాన కార్యదర్శి అనిల్  కుమార్, జిల్లా  ఉపాధ్యక్షులు ఖాదర్ హర్షం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment