Friday, 3 November 2017

ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకొవాలి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకొవాలి ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 03 :  కౌటాల కెజిబివి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని యమ్.పావణ్యను చితకబాదిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకొవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున డిఈవొ కార్యాలయంలో స్ట్రెక్టర్ ఆఫీసర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ విద్యాబుద్ధులు నెర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టడం సరికాదని అన్నారు. కౌటాల కెజిబివి పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న శిరీష విద్యార్థినిని చితకబాదడం వల్ల విద్యార్థినిని అస్వస్థతకు గురి కావడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం నుండి కౌటాల కెజిబివి పాఠశాలలో ఏదో ఒక విధంగా గందరగోళం పాఠశాలలో నెలకొంటుందని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వలన జిల్లాలోని విద్యాసంస్థలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని అన్నారు. జిల్లాలోని కెజిబివి పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాకపోవడం సిగ్గుచేటన్నరు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నిరెత్తినట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటన్నరు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొకుండ వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కౌటాల కెజిబివి పాఠశాలలో జరిగిన విషయంలో సమగ్ర విచారణ జరిపి బధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేశారు. లేని పక్షంలోఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, మండల కార్యదర్శి పర్వతి సాయి పాల్గొన్నారు..

No comments:

Post a Comment