డిజిటల్ క్లాస్ రూమ్ పనితీరును పరిశీలించిన ఎం ఈ ఓ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 30 : రెబ్బెన మండలం పులికుంట గ్రామంలోని ప్రాధమిక పాఠశాలను రెబ్బెన మండల విద్యాధికారి గురువారం సందర్శించారు. ప్రాధమిక పాఠశాలలో దాతలు సమకూర్చిన పరికరాలతో డిజిటల్ క్లాస్ రూమ్ పనితీరును ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన పరికరాల ఏర్పాటుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, చూపిన చొరవను అభినందించారు. అనంతరం మాట్లాద్దుతూ విద్యాబోధన డిజిటల్ క్లాస్ పద్దతిలో జరపడంవలన విద్యార్థులు చాల సరళంగా సూక్ష్మంగా చదువు నేర్చుకోగలరని అన్నారు.డిజిటల్ క్లాస్ రూమ్ పనితీరును ఆయన ప్రశంసించారు. . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్,పాల్గొన్నారు.
No comments:
Post a Comment