జిల్లాపాలనాధికారి కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 : ప్రజా ఫిర్యాదుల్లో భాగంగా జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్ సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో భాగంగా వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులకు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. దహెగాం మండలం నివాసి అయిన ప్రమీల తనకు వికలాంగుల పెన్షన్ ఇప్పించమని ప్రభుత్వ భూమి ఇప్పించమని, కౌటాల మండల గ్రామస్తులు పట్టాపాసు పుస్తకాలను ఆన్ లైన్ లో అప్ డేట్ కాలేదని, హమీద్ ఆసిఫాబాద్ నివాసి తనకు ఇల్లు ఉపాధి కల్పించమని కెరమెరి మండల నివాసి గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు వేయించమని అలాగే వికలాంగులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని తదితర ఆర్జీలు సంయుక్త పాలన అధికారికి సమర్పించారు ఈ ప్రజా ఫిర్యాదులో భాగంగా ప్రజల నుండి తొంభై ఆరు అర్జీలు అందాయన్నారు. ఈ సమావేశంలో సిపిఓ కిష్టయ్య, డి ఆర్ డి వో పిడి శంకర్ ,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
I completed my M.pharmacy sir,I required job with good salary to support my family
ReplyDelete