Thursday, 30 November 2017

అడా ప్రాజెక్ట్ వద్ద మౌలిక వసతుల ఏర్పాటుకై పరిశీలన

అడా ప్రాజెక్ట్ వద్ద మౌలిక వసతుల ఏర్పాటుకై పరిశీలన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 30 :  కొమురంభీం జిల్లాలోని ఆడా ప్రాజెక్టు వద్ద గల అటవీ ప్రాంతంలో ట్రాకింగ్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు  కొరకు  జిల్లా పాలనాధికారి చంపాలాల్ పర్యటించారు. జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరం భీం ఆడా నీటి పారుదల ప్రాజెక్టు సమీపంలో ట్రాకింగ్ ప్రణాళిక రూపొందించేందుకు ఈ ప్రాంతాన్ని గురువారం సందర్శించా రు. ఆ ప్రదేశంలో ఏ సమయంలోనైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ స్థలాన్ని పరిరక్షించేందుకు వీలుగా వాచ్ టవర్ నిర్మించేందుకు మరియు ట్రాకింగ్ సౌకర్యం కల్పిస్తే ఆ ప్రదేశం పర్యాటక అభివృద్ధి చెందుతుందని అన్నారు. దానికి అనుగుణంగా జిల్లా పాలన అధికారి పది లక్షల రూపాయలు మంజూరు చేస్తామని జిల్లా పాలనాధికారి అన్నారు. కఠినమైన ఆడా పరిసర ప్రాంతాల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం మరియు  కొండ పై నుంచి ఎటు చూసినా పచ్చటి వాతావరణం ఉంటుందన్నారు. ఈ ప్రాంతాన్ని  అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ   అధికారితో అన్నారు . గుట్టపై నుంచి అడ ప్రాజెక్టు పరిసరాలను వీక్షించేందుకు వీలుగా నిర్మించబోయే వాచ్ టవర్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ట్రెక్కింగ్  ట్రాక్ మరియు అటవీప్రాంతాన్ని   సందర్శించారు .వాచ్ టవర్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాలను పూర్తిగా ఐదు కిలొ.మి కాలినడక ప్రయాణం చేస్తూ అలాగే మిషన్ భగీరథ పనులను జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు అందులో భాగంగా ఫేజ్ వన్ లో భాగంగా 115 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇంట్రెస్ట్ వాల్ వన్లో నైన్టీన్ పర్సన్ పనులు పూర్తయ్యాయని ఇందులో  116 ఎం ఎల్ డి  90% పనులు పూర్తయ్యాయని 10 % త్వరలో పూర్తి  పూర్తయితేనే అన్నారు. ఈ కార్యక్రమంలో పాలనాధికారితోపాటు సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్,, జిల్లా  అధికారులు  పాల్గొన్నారు. 

డిజిటల్ క్లాస్ రూమ్ పనితీరును పరిశీలించిన ఎం ఈ ఓ

డిజిటల్ క్లాస్ రూమ్ పనితీరును పరిశీలించిన ఎం ఈ ఓ 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 30 :   రెబ్బెన  మండలం  పులికుంట గ్రామంలోని ప్రాధమిక పాఠశాలను రెబ్బెన మండల విద్యాధికారి   గురువారం సందర్శించారు. ప్రాధమిక పాఠశాలలో దాతలు సమకూర్చిన పరికరాలతో   డిజిటల్ క్లాస్ రూమ్   పనితీరును ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన పరికరాల ఏర్పాటుకు   పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, చూపిన చొరవను అభినందించారు.  అనంతరం మాట్లాద్దుతూ విద్యాబోధన డిజిటల్ క్లాస్ పద్దతిలో జరపడంవలన విద్యార్థులు చాల సరళంగా సూక్ష్మంగా  చదువు నేర్చుకోగలరని అన్నారు.డిజిటల్ క్లాస్ రూమ్ పనితీరును ఆయన ప్రశంసించారు. . ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్,పాల్గొన్నారు.  

సెర్ప్ ఉద్యోగుల 32 వ రోజు సమ్మెలో అరగుండు నిరసన

 సెర్ప్ ఉద్యోగుల 32 వ రోజు సమ్మెలో  అరగుండు నిరసన 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 30 :    గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు  తమ న్యాయమైన  డిమాండ్లను నెరవేర్చాలని డీఆర్‌డీవో, సెర్ప్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరింది..  ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట అరగుండు చేయించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ  వివిధ పార్టీలకు,సంఘాలకు చెందిన నాయకులూ సంఘీభావం తెలిపిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. సెర్ప్‌ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో జాడి వేణుగోపాల్, కుర్ర  రమేష్, ఎం పోచాలు , బి సరోజ, అశోక్, కౌసల్య ,ఇందిర, తదితరులు పాల్గొన్నారు. 

ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం

ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 30 :   ప్రపంచ తెలుగు మహాసభల కొమురంభీం  జిల్లా స్థాయి  సన్నాహక సమావేశం జిల్లాపాలనాధికారి చంపాలాల్  ఆధ్వర్యంలో కవులు, కళాకారులతో జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలని, వేడుకలలో పాల్గొనే కవులు , కళాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మహాసభల సందర్భంగా ర్యాలీ, మానవహారం వేడుకలు నిర్వహిస్తామన్నారు. జిల్లాస్థాయి మహాసభల సందర్భంగా  డిసెంబర్ 8వ తేదీన విద్యార్థులు, కవులు, కళాకారులతో జిల్లా కేంద్రంలో ర్యాలీ, మానవహారం నిర్వహిస్తామని అన్నారు. జిల్లా స్థాయి ముగింపు వేడుకలు డిసెంబర్ 12 న నిర్వహించాలన్నారు. ఆ రోజు ఉదయం 09. 20 నుండి కవిసమ్మేళనం ఉంటుందని, అనంతరం భోజన విరామం మధ్యాహ్నం 1.00 నుండి 2. 00 వరకు, తరువాత 2.00 నుండి 4,30 వరకు అనంతరం కళాకారులకు సన్మాన కార్యక్రమం   ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, ఏ  పి  ఆర్ ఓ తిరుమల, కవులు రుద్రాల వెంకటేశ్వర్లు, మాడుగులవెంకటేశ్వర శర్మ, మాడుగుల, ధర్మపురి వెంకటేశ్వర్లు, బిట్ల వెంకటస్వామి, సారధి కళాకారులూ ఇర్ఫాన్, జానపద కళాకారుల సంక్షేమ సంఘం కళాకారులూ తొగరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 28 November 2017

ఆంధ్రా బ్యాంకు 95 వ వ్యవస్థాపక దినోత్సవం

ఆంధ్రా  బ్యాంకు 95 వ వ్యవస్థాపక దినోత్సవం 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 28 :   రెబ్బెన మండల కేంద్రంలో ని ఆంద్ర బ్యాంకు లో బ్యాంకు 95వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా సోమవారం జరుపుకున్నారు. బ్యాంకు వ్యవస్థాపకులైన స్వర్గీయ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ నీలం రమేష్ మాట్లాడుతూ మహోన్నతుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య  చిన్నగా స్థాపించిన బ్యాంకు ఈ రోజు   సుమారు మూడువేల శాఖలతో దినదినాభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని ఖాతాదారులకు మరింత నాణ్యమైన సేవలను అందిస్తామని అన్నారు. ఖాతాదారులు ఎక్కువగా నగదురహిత లావాదేవీలపై ద్రుష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్యాషియర్ శ్యామ్ సుందర్, సిబ్బంది లక్ష్మి, గబ్బర్సింగ్, ఖాతాదారులు బాల్కర్ ,పోషయ్య, శ్రవణ్,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 127వ వర్ధంతి వేడుకలు

బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 127వ వర్ధంతి వేడుకలు 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 28 :  రెబ్బెన మండలం గోలేటిలో  మహాత్మా జ్యోతిబాపూలే 127వ  వర్ధంతి సందర్భంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు ఒరగంటి రంజిత్ మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి నాంది పలికిన సామాజిక దార్శనికుడు   జ్యోతిబాపులే   సామాజిక సేవలే కాకుండా  మహిళల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, కింది జాతుల విముక్తి కోసం పోరాటం చేసిన మహానుభావుడు , బడుగు బలహీన వర్గాలను చైతన్యపరచిన విప్లవజ్యోతి మతోన్మాదంపై నిరంతరం  పోరాడుతూ వచ్చాడు. ఆయన పోరాట స్ఫూర్తికి మహాత్మ పూలే ని తన గురువుగా ప్రకటించుకున్నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.    మహాత్మా జ్యోతిబాపూలే 1848 లొ మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యా ప్రదాత ప్రతి ఒక్కరు కూడా మహాత్మాజ్యోతి బాపులే ని ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్ మరియు కార్యదర్శులు  ఎగ్గ తిరుపతి, బల్గూరి తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.

Monday, 27 November 2017

రెబ్బెన లో SBI బ్యాంకు వారి CSP సెంటర్ ప్రారంభం

రెబ్బెన లో SBI బ్యాంకు వారి CSP సెంటర్ ప్రారంభం  
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 :  రెబ్బెన మండల కేంద్రంలో గల SBI బ్రాంచ్ సమీపం లో  ఖాతాదారుల సౌకర్యార్ధం  కస్టమర్ సర్వీస్ పాయింట్ ను ఓపెన్ చేయడం జరిగిందని బ్రాంచ్ మేనేజర్ శ్రీ కోవా హనుమంత్ రావు తెలిపారు. ఈ csp నందు ఆధార్ కార్డు అనుసంధామ్ గల ఖాదాదారులు దేశం లో ఎక్కడి నుండి  ఏ బాంక్ ఖాతా కైనా రూపాయలు 2౦౦౦౦/ - ల వరకు నగదు బదిలీ చేయవచ్చును, రోజుకు రూపాయల 1౦౦౦౦/_ వరకు నగదు ను తమ తమ ఖాతాల నుండి తీసుకునే  సౌకర్యం కలదు, మరియు సున్నా బాలన్స్ అకౌంట, స్టూడెంట అకౌంట్ , ఫిక్స్డ్ డిపాజిట్, rd  కుడా ఇక్కడ చేసుకునే అవకశం వుంది , వీటితో పాటు ప్రధాన మంత్రి భీమా యోజన లాంటి ఇన్సూరెన్స్ పథకాలను కుడా అండసేస్తారాని తెలిపారు .ఈ సెంటర్ ఉదయం 8 గంటలనుడి రాత్రి 8 గంటల ౩౦ ని "ల వరకు పనిచేయు యునాని తెలిపారు .

జిల్లాపాలనాధికారి కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

జిల్లాపాలనాధికారి కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
  
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 : ప్రజా ఫిర్యాదుల్లో భాగంగా జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ కుమార్ సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులను  స్వీకరించారు ఇందులో భాగంగా వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి  సంబంధిత అధికారులకు  సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. దహెగాం  మండలం నివాసి అయిన ప్రమీల  తనకు వికలాంగుల పెన్షన్ ఇప్పించమని ప్రభుత్వ భూమి ఇప్పించమని, కౌటాల మండల గ్రామస్తులు పట్టాపాసు పుస్తకాలను ఆన్ లైన్ లో  అప్ డేట్  కాలేదని, హమీద్ ఆసిఫాబాద్ నివాసి తనకు ఇల్లు ఉపాధి కల్పించమని కెరమెరి మండల నివాసి గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు  వేయించమని అలాగే వికలాంగులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని తదితర ఆర్జీలు సంయుక్త  పాలన అధికారికి సమర్పించారు ఈ ప్రజా ఫిర్యాదులో భాగంగా ప్రజల నుండి తొంభై ఆరు  అర్జీలు అందాయన్నారు.  ఈ సమావేశంలో సిపిఓ కిష్టయ్య, డి ఆర్ డి వో   పిడి శంకర్ ,జిల్లా అధికారులు  పాల్గొన్నారు. 

ప్రజా ఫిర్యాదుల పట్ల జవాబుదారిగా వుండాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

ప్రజా ఫిర్యాదుల పట్ల జవాబుదారిగా వుండాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 
   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 :   ప్రజా ఫిర్యాదుల పట్ల  అధికారులు బాద్యతయుతముగ వ్యవహరిస్తూ ఫిర్యాదు పురోగతిని  పారదర్శకంగ  ఫిర్యాదు దారులకు ఎప్పటికప్పుడు  తెలపాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. స్థానిక జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయము లో జిల్లా ఎస్పి   సోమవారం నాడు ప్రజా ఫిర్యాదు ల విబాగం ను నిర్వహించారు ,ప్రజా ఫిర్యాదు విబాగం కు వచ్చిన మొత్తం 11 మంది ఫిర్యాదుధారుల యొక్క  ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు ప్రజా ఫిర్యాదు విబాగం లో  దుర్గం లక్ష్మి తండ్రిపేరు   మల్లయ్య  భారే గూడ మండలం కాగజ్ నగర్ , చల్లురి కమల భర్తపేరు  రాజేశ్వర్ గోలేటి మండలం రెబ్బెన, దుర్గం తార  భర్తపేరు  రాములు   కాగజ్ నగర్ లు తమ యొక్క తల్లి గారి ద్వారా సంక్రమించిన వారసత్వ భూమిపై  పూర్తి హక్కులు కలిగివున్న తమను, అన్యులు తమ యొక్క భూమి ను ఖాళి చేయాలనీ బలవంతపు వత్తిడి కు లకు పాల్పడుతూ దుర్భాషలాడుతున్నారని   దాడులకు దిగుతున్నారని జిల్లా ఎస్పిగారికి ఫిర్యాదు చేసి తమకు సహాయo అందేలా చర్యలు తిసుకువాలని విన్నవించుకున్నారు, సిర్పూర్ మండలం లోనేవెల్లి కు చెందిన గోమాసు వాసుదేవ్ తండ్రిపేరు గొండుజి  లు తమ వద్ద డబ్బులు తీసుకొని  మోసం చేసారు అని తగు విధం గా వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు, ఆత్రం గోవింద్ రావు ఆసిఫాబాద్ , మాండ్యపార్థు కౌటాల లాలూ తమతమ భూ సమస్యలను జిల్లా ఎస్పి కు వివరించారు.  ఫిర్యాదుదారుల యొక్క  సమస్యలను సావదానం గా విన్న జిల్లా ఎస్పి తగు సూచనలతో సంబందిత అధికారులను తక్షణం న్యాయం జరిగేలా చర్యలను తీసుకోవాలని  సంబందిత అధికారుల ను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదు కార్యక్రమము లో అడిషనల్ ఎస్పి అడ్మిన్ గోద్రు ,ఆసిఫాబాద్ డి ఎస్పి సత్యనారాయణ , ఎస్పి సీసీ దుర్గంశ్రీనివాస్ ,డిసిఅర్బి ఎస్సై  రాణాప్రతాప్ , పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి  ప్రహ్లాద్ , కేదార సూర్యకాంత్,  సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , కరుణ , ఫిర్యాదుల విభాగం అధికారి సునీత , కిరణ్ కుమార్ లు  మరియు లు పాల్గొన్నారు.

రెబ్బెన మండలం కిష్టాపూర్ లో జాక్ కమిటీ ఎన్నిక

రెబ్బెన మండలం కిష్టాపూర్ లో  జాక్ కమిటీ ఎన్నిక 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 27 :  రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామ  జాక్ నూతన  కమిటీని రెబ్బెన మండలం జాక్ చైర్మన్ మిట్టదేవధర్  ఆధ్వర్యంలో  ఎన్నుకోవడం జరిగిందని జాక్ జిల్లా కో కోర్డినేటర్ రాయిలా నరసయ్య  తెలిపారు. కిష్టాపూర్ గ్రామా జాక్ చైర్మన్గా కోతోడే  హరీష్ రెడ్డి, కన్వీనర్ గ సువర్కర్ ప్రహ్లాద్,కో చైర్మన్గా సువర్కర్ నాగరాజు, కో   కన్వీనర్ గ మామిడి తిరుమల, సభ్యులుగా శంకర్, రాకేష్, శ్రీనివాస్, వెంకటేష్  లను ఎన్నుకొన్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా జాక్ రైతుల, రైతుకూలీల, విద్యార్థుల, నిరుద్యోగుల  సమస్యలపై దృష్టి   పెట్టి, సకాలంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించేవిధంగా పనిచేయాలని అన్నారు. . ఈ సమావేశంలో దుర్గం మల్లయ్య, సంగం చందు,  ప్రేమ్కుమార్  పాల్గొన్నారు. 

Saturday, 25 November 2017

నిరుద్యోగుల సమరభేరిని విజయవంతం చేయండి

నిరుద్యోగుల సమరభేరిని విజయవంతం చేయండి 
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 25 : నిరుద్యోగుల సమరభేరి సభను విజయవంతం చేయాలని బీజేవైఎం మండలాధ్యక్షుడు ఖాంద్రే  విశాల్ అన్నారు.  శనివారం రెబ్బెన  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26తేదీన హైదరాబాద్ లో  జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు,  ఇంటికో ఉద్యోగం పేర కేవలం హామీలకే పరిమితం చేసి నీటిమీద రాతలు   చేశారన్నారు. గత నెల 30న బీజేవైఎం   ఆధ్వర్యంలో చలో అసెంబ్లీని చేపట్టగా  దానిని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుని బీజేవైఎం  కార్యకర్తలను మరియు నిరుద్యోగులను ఎక్కడికక్కడే అరెస్టులు చేసి నిర్బంధం చేశారన్నారు. ఇంటికో ఉద్యోగం లక్ష ఉద్యోగాల చొప్పున ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి, బిజెపి బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేసరి ఆంజినేయ గౌడ్ ,  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు క్రిష్ణకుమారి, బిజెపి రెబ్బెన మండల అధ్యక్షుడు కుందారపుబాలకృష్ణ,  బీజేవైఎం మండలాధ్యక్షుడు ఇగురపు  సంజయ్ , బిజేవైయం అసిఫాబాద్ పట్టణ అధ్యక్షుడు బి సాయితేజ  తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతుల్నిప్రభుత్వం ఆదుకోవాలి : జేఏసీ నాయకులు

నష్టపోయిన రైతుల్నిప్రభుత్వం  ఆదుకోవాలి : జేఏసీ నాయకులు
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 25 : అకాల వర్షానికి నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని రెబ్బెన మండలం  కిష్టాపూర్, కొమరవెల్లి గ్రామాలలో  జరిగిన పత్తి, వరి పంటకు నష్టపరిహారం చెల్లించాలని  జాక్ ఛైర్మెన్ మిట్ట దేవేందర్, కో-చైర్మెన్ బోగే ఉపేందర్, జిల్లా కో-కన్వీనర్ రాయిల్లా నర్సయ్య, మండల కో కన్వీనర్ మల్లయ్యలు అన్నారు. శనివారం ఆ రెండు గ్రామాలలో  పంట పొలాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ   ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు రైతులకు నోటి దాకా వచ్చిన పంటలు అకాల వర్షాలు కారణం చేత వరి  మరియు పత్తి  రైతులు నష్టపోయారని వారికి నష్టపరిహారం ఎకరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు సరైన వర్షపాతం లేక చెరువుల కింద వరి పంట వేసిన   రైతులు ఎంతోమంది ఉన్నారని  వారికి ప్రభుత్వం తరుపునుంచి సహాయం కావాలని కోరారు.వీరితో పాటు  జెఎసి జాక్ నాయకు ప్రేమకుమార్, శ్రీనివాస్,తిరుమలు మరియ రైతులు ఉన్నారు.

Friday, 24 November 2017

స్నేహ కల్చరల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయంలో వారోత్స్వాలు

 స్నేహ  కల్చరల్  సంస్థ ఆధ్వర్యంలో  గ్రంథాలయంలో వారోత్స్వాలు 

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 24 :   రెబ్బెన మండలం లోని గోలేటి టౌన్ షిప్లో  గల గ్రంథాలయంలో  శుక్రవారం విద్యార్థిని విద్యార్థులచే ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలను స్నేహ  కల్చరల్  సంస్థ ఆధ్వర్యంలోజరుపుకున్నారు.  గ్రంథాలయాల ద్వారా ప్రయోగం ఏమిటో అనే  అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది ప్రథమ బహుమతి బి శరణ్య రెండో బహుమతి కుమార్ వినేష్ మూడవ బహుమతి ఎస్ ఉమాదేవి విజేతలుగా నిలిచారు.   ఈ కార్యక్రమంలో ఏ నాగేశ్వర్ గారు సింగరేణి  స్కూల్ టి వెంకటేశ్వర్లు హెచ్చ ఎం  మరియు టిబి గోపాలకృష్ణారావు అధ్యక్షులు బహుమతులు ప్రధానం చేశారు.  సభ్యులు ఎం ప్రసాద్, రాము, నారాయణ, కె మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 




పోలింగ్ ప్రక్రియ పై విద్యార్థులకు అవగహన

పోలింగ్ ప్రక్రియ పై విద్యార్థులకు అవగహన 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 24 : జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా  పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు దాని ప్రాముఖ్యాన్ని  తెలిపరిచేందుకు ఉపాధ్యాయులు మాక్ పోలింగ్ నిర్వహించారు.ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ముఖ్య అతిధిగా రెబ్బెన మండల  ఎంపీపీ కార్నాథం సంజీవ్ కుమార్  హాజరు అయ్యారు. ఆయన  మాట్లాడుతూ దేశంలోని ప్రజలకు అన్ని హక్కుల కంటే కూడ ఓటు హాక్కు చాల ప్రాధాన్యమైందని అన్నారు. ప్రజాస్వామ్యమైన దేశంలో స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవచ్చని, దేశ భవిష్యత్తు ఓటర్లపై ఆదారపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు వివరిస్తూ బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు చేపట్టారు.కాగా విద్యార్థులే ఎన్నికల అధికారులుగా, ఏజెంట్లుగా, పోలింగ్  రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌, దరఖాస్తుల (నామినేషన్) స్వీకరణ, ఉపసంహరణ, స్క్రుటిని, పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, ఓటింగ్‌ ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అనంతరం అభ్యర్థుల గుర్తులతో కూడిన బ్యాలెట్‌, చూపుడు వేలుకు సిరా అంటించడం, నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి బ్యాలెట్‌ బాక్సుల్లో వేసే ప్రక్రియను నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ,ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, మోడెం సుదర్శన్ గౌడ్,  ఎస్ఎంసి అధ్యక్షా, ఉపాధ్యక్షులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Thursday, 23 November 2017

ఐ పి ఎస్ అధికారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 5 కే రన్

ఐ  పి  ఎస్ అధికారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 5 కే రన్ 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 23 :గురు కుల పాఠశాలల గౌరవ సెక్రెటరీ డాక్టర్ ఆర్  ఎస్ ప్రవీణ్ కుమార్ ఐ  పి  ఎస్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం  అసిఫాబాద్ లో 5k రన్ కార్యక్రమాన్ని  నెవెర్  గివ్  అప్ డే  వేడుకల్లో భాగంగా 1200 మంది స్వేరో లతో కలెక్టరేట్ మీదుగా ,బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహం ముందు నుండి గిరిజన బాలికల గురుకుల పాఠశాల వరకు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన  డి సీ  ఓ  సత్యనారాయణ,పి  టి జి  ప్రిన్సిపాల్  శ్రీనివాస్ రెడ్డి, స్వేరో జోనల్ సహాయ కార్యదర్శి హేమంత్ షిండే, జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య,ఉపాధ్యక్షులు ఆత్మ రాం, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ మహేష్,మారుతి, అసిఫాబాద్ మండల బాధ్యులు వెంకటేష్, కొల్లూరి శంకర్, ఉపాధ్యాయులు లకావత్ శంకర్, 1200 మంది జూనియర్ స్వేరో లు పాల్గొన్నారు. 


ఇరవై ఐదవ రోజుకు చేరిన సెర్ప్ ఉద్యోగుల సమ్మె

ఇరవై ఐదవ రోజుకు చేరిన సెర్ప్ ఉద్యోగుల సమ్మె 
  
              కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 23 :ఇరవై ఐదవ రోజుకు చేరుకున్న సెర్ప్ ఉద్యోగుల సమ్మె ఇకనైనా  ప్రభుత్వం వెంటనే స్పందించాలని   గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న మహేష్, శ్యామ్ రావు, శంకర్, విజయ్ కుమార్, రాజేశ్వరి, హనుమంత రావు, సుజాత, స్వర్ణ లు అన్నారు.   జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట  . తమ  సమస్యలను  ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ    నిరసన తల పట్టి ఇరవై ఐదు రోజు లైన ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయమని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 

సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర ; మద్దిలేటి

సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర ; మద్దిలేటి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 23 : సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల  ద్వారానే వరికి  గిట్టుబాటు ధర లభిస్తుందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార అధికారి మద్దిలేటి అన్నారు.గురువారం  రెబ్బెన మండలంలోప్రాధమిక సహకార సంఘం ఆధ్వర్యంలో   వరి   కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ తమ కేంద్రాల్లో ఏ  గ్రేడ్ వరికీ 1590 ,బిగ్రేడుకు   1550 చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపారు.సహకార శాఖ  ఆధ్వర్యంలో ఇప్పటివరకు  జిల్లాలో 21 కేంద్రాలు ఏర్పాచేస్తున్నామన్నారు. రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి  సంజీవ్ కుమార్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, సింగల్ విండో  చైర్మన్ జి రవీందర్, సివిల్ సప్లైస్ జిల్లా అధికారి గోపాల్, డిఎస్ఓ లక్ష్మీనారాయణ, డీ ఎ సి ఓ రబ్బాని, కోపరేటివ్ వార్ ఆడిటర్స్ శ్రీదేవి రాజేశ్వరి, సి ఈ  ఓ సంతోష్ కుమార్, సింగల్ విండో డైరెక్టర్ పేసరి మధునయ్య,  షైక్ మహమూద్,వెంకటరమణ, షైక్ ఇమామ్, రాజేశ్వరి, శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 22 November 2017

పాత్రికేయులను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి ; అబ్దుల్ రహమాన్

పాత్రికేయులను అవమానించిన ఎమ్మెల్యేపై  చర్యలు తీసుకోవాలి ;  అబ్దుల్ రహమాన్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 22 :  పాత్రికేయులను  లను అవమానించిన మంచిర్యాల ఎమ్మెల్యే పై వెంటనే చర్యలు తీసుకోవాలని  టి యు డబ్లు  జే  (ఐ జే  యు ) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ అన్నారు.  బుధవారం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లో  వూదయం ప్రతినిధితో మాట్లాడుతూ    ఎమ్మెల్యే మీడియా పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. వెంటనే  జర్నలిస్ట్ లకు  బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. రోజు రోజు కు ఎమ్మెల్యే లు జార్నలిస్టుల ను కించపరిస్తూ అవమనిస్తున్నారు .ఈవిషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.ముఖ్యమంత్రి కల్పించుకొని తమ పార్టీ ఎం ఎల్ ఏ  లను తగు విధంగా నియంత్రించాలని కోరారు. 

మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకెళ్లాలి : రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు త్రిపురాన వెంకటరత్నం

మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకెళ్లాలి :  రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు త్రిపురాన వెంకటరత్నం
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 22 :  రాష్ట్రవ్యాప్తంగా సఖి కేంద్రాలు మహిళా సంస్థలు ఉన్నాయని మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారిని సంప్రదించాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ త్రిపురాన వెంకటరత్నం  అధ్యక్షతన  జరిగిన సదస్సలో వివిధ చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా  కేంద్రంలో మహిళా అవగాహన సదస్సు రెండవ రోజు  మాట్లాడుతూ  181 హెల్ప్లైన్  మహిళలకు పూర్తి అండగా ఉంటుందని  కాల్ చేస్తే సలహాలు కౌన్సిలింగ్ రక్షణ కల్పిస్తుంది అన్నారు డిటి హెల్ప్లైన్ వారానికి ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు ఉచితంగా సేవలు అందిస్తుందా అందించుటకు అందుబాటులో ఉంటుందన్నారు. జోగిని వ్యవస్థ జోగినీలు  సమాజానికి బానిసలవుతున్న వాస్తవాలను చిత్ర రూపంలో ప్రదర్శించారు అదే విధంగా సమాజంలో పెరుగుతున్న అద్దెగర్భాల యొక్క సంస్కృతిపై విచారం వ్యక్తం చేశారు అద్దెగర్భం విధానం అనేది మహిళల హక్కులకు భంగం కలగడమే అన్నారు.  పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు మగవారితో పాటుగా  సమాన హక్కులను కల్పించాలన్నారు వృక్షో రక్షితి రక్షిత అన్నట్లుగా మహిళా రక్షితి రక్షిత అన్న చందంగా మన జాతిని మనమే రక్షించుకోవాలన్నారు ఆకాశంలో సగభాగం  మహిళ అని సమాజంలో సగ భాగం మహిళ అని  సృష్టికి మూలం మహిళ, మహిళ లేనిదే మానవ మనుగడ శూన్యం అని చెప్పుకుంటున్నామని ఇది మహిళా స్థితిగతులలో గుణాత్మకమైన మార్పు ఒక పక్క కనబడుతూనే, మహిళలపై వివక్ష మరో పక్కన కొనసాగుతున్నదని అన్నారు.   ఏ రోజయితే ఈ దేశంలో మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నిర్భయంగా నడిచి వెళ్ళగలుగుతుందో  ఆ రోజు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినట్లు అని అన్నారు.  ఆనాడు జాతిపిత మహత్మగాంధీ మహిళల స్థితిగతులు దృష్టిలో పెట్టుకుని దేశ ప్రజలనుద్దేశించి చెప్పిన మాటలు నేటికి మనం  మననం  చేసుకోవా చేసుకోవలసిన పరిస్థితి ఉన్నదని  స్వాతంత్ర్య సమరాన్ని నడిపే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తీసుకు రాగలిగారు కానీ ఈ నాటికి జాతిపిత ఆశించిన విధంగా మహిళలకు సంబంధించిన నిజమైన స్వాతంత్య్రం వచ్చిందా అన్నది నేడు మన ముందున్న ప్రశ్న అన్నారు అందువల్ల మహిళలు జాగ్రత్తతో ముందుకెళ్లాలని చట్టాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు సమస్యల పరిష్కార మార్గాల నిమిత్తం రాష్ట్ర మహిళా కమిషన్కు వ్యక్తిగతంగా పోస్టు ద్వారా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసే సత్వర న్యాయం చేస్తానన్నారు మహిళలు అన్ని రంగాలలో ధైర్యంగా దూసుకెళ్లాలని మహిళాసాధికారతను సాధించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క మహిళ చేయి చేయి కలిసి హింసను ఎదుర్కొని మహిళల హక్కులను సాధించాలన్నారు ఈ అవగాహన సదస్సులో హైకోర్టు న్యాయమూర్తి విజేత, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజేషన్ సరోజ, పిడి సావిత్రి సిడిపిఓలు, సూపర్వైజర్లు అరగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 21 November 2017

మహిళాలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : త్రిపురాన వెంకట రత్నం

మహిళాలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : త్రిపురాన వెంకట రత్నం 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 21 : మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం అన్నారు మంగళవారం జిల్లా  కేంద్రమైన ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రేమళ గార్డెన్లో  జరిగిన  మహిళా చట్టాల అవగాహన సదస్సులో జిల్లా పరిపాలనాధికారి ఎం చంపాలాల్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం పాల్గొని జ్యోతి ప్రజలన గావించారు అనంతరం జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రత్యేకించి ఈ జిల్లాకు చైర్మన్  వచ్చి మహిళా చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నందుకు మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు మహిళల కోసం ఎన్నో చట్టాలు వచ్చాయని ఆ చట్టాలను ఉపయోగించుకోలేక పోతున్నారని అన్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి రెండు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా చైర్మన్ ని కలిసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు చైర్మన్ మాట్లాడుతూ మహిళల చట్టాల అవగాహన సదస్సు రెండు రోజుల పాటు కొనసాగుతుందని భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులను కల్పిస్తుందని మహిళా రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ ఏవీ అమలులోకి రావడం లేదన్నారు వరకట్న నిషేధ చట్టం ఆస్తి బాల్యవివాహాలు  ఇలా ఎన్నో ఉన్నప్పటికీ ఏవీ అమలు కావడం లేదన్నారు. గిరిజనంలో విద్య శాతం తక్కువగా ఉన్న చోట ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయని  మహిళలకు స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా మహిళలకు సాధికారిత దిశగా ముందుకు పోలేకపోతున్నారు ఇప్పటికీ మహిళలను చిన్న చూపు చూస్తున్నారు. ఉదాహరణకు సర్పంచ్లు జడ్పీటిసిలు ఎంపిటిసిలు మహిళలు ఉన్నప్పటికీ వారి స్థానంలో పురుషులు నిధులు నిర్వహిస్తున్నారు . వారికి కేటాయించిన స్థానంలో వారిని విధులు నిర్వహించుకునేలా చూడాలన్నారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలను మహిళలను గౌరవించేలా  పెంచాలన్నారు ఆడా మగా తేడా లేకుండా ఇద్దర్నీ ఒకేలా సమానంగా పెంచాలని ఈ అవగాహన సదస్సులో ఆసిఫాబాద్  శాసనసభ్యురాలు కోవ లక్ష్మి, హైకోర్టు న్యాయమూర్తి వేజెత,  ఎంపిపి తారాబాయి,  మహిళా సర్పంచులు డిఆర్డిఏ పిడి శంకర్ జిల్లా అధికారులు ఐసిడిఎస్ పిడి సావిత్రి సూపర్ వైజర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ విరాళం

ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ విరాళం 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 21 :  రెబ్బెన మండలంలోని గోలేటి కాలనీ ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా వాటర్ ప్యూరిఫైర్  ను   బ్యాంకు ఉద్యోగైన  జాడి నాందేవ్ తన కుమార్తె అంకిత మొదటి పుట్టిన రోజు సందర్భంగా క్లాసిక్ వాటర్ ఫ్యూరిఫైయర్ ఫిల్టర్ని అందజేయడం  జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమారాణి తెలిపారు  అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు  ఈ కార్యక్రమంలో సహోపాధ్యాయులు కె శ్రీనివాస్ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఓ డి ఎస్ నిధుల మంజూరులో చేతివాటం పై ఏపీఓ కు ఫిర్యాదు

ఓ డి ఎస్  నిధుల మంజూరులో చేతివాటం పై  ఏపీఓ కు ఫిర్యాదు    
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 21 :   రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలోని  మనలోని ఆర్ ఆర్ కాలనీకి చెందిన తొమ్మిది మంది మహిళలు తమ  వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి కేటాయించిన  నిధుల నుండి మూడు వేలు రూపాయలు  రెబ్బెన సర్పంచ్ మరియు పంచాయితీ కార్యదర్శి తీసుకున్నారని మంగళవారం ఎం పి  డి ఓ  ఆఫీసులో ఏ  పి  ఓ   కల్పనకు లిఖిత పూర్వకంగా  ఫిర్యాదు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పేద వారికి కేటాయించిన వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకోవడానికి శాంక్షన్ ఐన  పన్నెండు వేల రూపాయలలో మూడు వేల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు ఓ డి ఎఫ్ నిధుల నుండి డబ్బులు తీసుకున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్లూరి పద్మ  గుండేటి  మల్లక్క, గుండు తార, గజ్జెల, ఆశవ్వ, కళావతి, శ్రీలత, బి విజయ, వి కమల,  మరియు  జిల్లా సిపిఐ నాయకులు    రామడుగుల శంకర్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జాడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. 

Monday, 20 November 2017

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి ; జిల్లా పాలనాధికారి చంపాలాల్

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి ; జిల్లా పాలనాధికారి చంపాలాల్  
  
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 20 : ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలనీ    జిల్లా పాలనాధికారి చంపాలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.   కొమురం భీం .  జిల్లా పాలనాధికారి కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యల పరిష్కారానికై జిల్లా పాలనాధికారిని కోరారు. అన్నం దారి విజయ ,బాలాజీ నగర్, ఆసిఫాబాద్ నివాసి తన అర్జీలో తనకు మీ సేవ లేదా ఈ  సేవ మంజూరు చేయాలనీ, చిన్న లింగాపూర్ మండలం  ఆసిఫాబాద్ నివాసి సబ్   ప్లాన్ కింద మంజూరైన డీజిల్ ఆటోసబ్సిడీ  మంజూరు కొరకు, రాథోడ్ ప్రకాష్ ధనోరా మండలం వాసి భూ సర్వే నిలిపివేయాలని   , సిద్ధం దేవరం వాంకిడి  మండలం తన భూమి సరిహద్దులు మార్చివేసి ఆక్రమించారని ,న్యాయం చేయాలనీ, నిర్మల వాంకిడి  మండలం ఫించన్ ఇప్పించాలని కోరారు. మొత్తం  85 దరఖాస్తులు అందాయని అధికారులు ప్రజల ఫిర్యాదులపై సత్వరమే విచారణ జరిపి న్యాయం చేయాలనీ పాలనాధికారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్  కుమార్, డి ఆర్ డి ఏ  ప్రాజెక్ట్ ఆఫీసర్ శంకర్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

పంచాయితి ఏర్పాటు చేయాలనీ జిల్లా పాలనాధికారి వినతి

పంచాయితి ఏర్పాటు చేయాలనీ జిల్లా పాలనాధికారి వినతి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 20 :    కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామపంచాయతీ పరిధి లో ఉన్న మాధవాయిగూడా, పోతపల్లి, జెండగుడా, పాత మాధవాయిగూడా గ్రామాలను కలిపి నూతన గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని బీజేవైయం జిల్లా అధ్యక్షులు ఖండ్రే. విశాల్ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందచేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ గ్రామాల అభివృద్ధికి పంచాయితీగ ఏర్పాటు చేయాలనీ అన్నారు.   ఈకార్యక్రమంలో , బీజేవైయం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురపు సంజీవ్ మరియు గ్రామస్తులు అలగం. శ్రీనివాస్, చౌదరి. తిరుపతి, సప్తే. దిలీప్, డోబే.శ్రీనివాస్, రమేష్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Sunday, 19 November 2017

ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి వేడుకలు

ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి వేడుకలు 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 19 ;  భారత వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీ బాయి జయంతి సందర్భంగా ఆసిఫాబాద్‌ లో ఆదివారం  వసతీగృహములో ఏ.బీ.వీ.పీ జిల్లా కన్వీనర్ శ్రీ ఎలగతి సుచీత్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా  ఝాన్సీ లక్ష్మీ బాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం1857 మరియు  ఝాన్సీ లక్ష్మీ బాయి నానాసాహెబ్ పీష్వా తాంతియాతోపే లు ఆంగ్లేయులపై వీరోచితంగా పోరాటం చేయడం తో భారత్ స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనే అవకాశం వచ్చిందనీ అన్నారు. ఫలితమే 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం కాబట్టి ప్రతీ విద్యార్థి ఒక ఝాన్సీ లక్ష్మీ బాయి లా స్వధర్మం స్వరాజ్యం స్వాభిమానం కై కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. విర వనితను స్మరించుకోవటం, ఆమె ధీరత్వాన్ని గుర్తు చేసు కోవటం, బ్రిటిష్ వారిని ఎదిరించటం , ఆమె ఆత్మాభిమానాన్ని  ఈ నాటి ఆడ పిల్లలకి ఎంతో స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు  . ఈ సందర్భంగా స్త్రీ శక్తి దివస్ గా ఝాన్సీ లక్ష్మి బాయి జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర అధ్యక్షుడు మహేష్ నగర కార్యదర్శి రమేష్ నగర సాయ కార్యదర్శి నవీన్ కార్యకర్తలు రాజు సాయి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




ఇందిరా గాంధీ శతజయంతి వేడుకలు

ఇందిరా గాంధీ శతజయంతి వేడుకలు 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 19 ; భారత దేశ మొదటి మహిళా  ప్రధాన మంత్రి   స్వర్గీయ ఇందిరా గాంధీ శతజయంతిని ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలొ మాజీ శాసన సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు స్థానిక ఏస్.సి గురుకుల పాఠశాలలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టడం జరిగింది. అనంతరం ఆత్రం సక్కు  మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా గాంధి ప్రధానిగా ఉన్న కాలం లో దేశంలోని బ్యాంకులను జాతీయం చేశారన్నారు. దేశంలోని పేద,  బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారు అని గరీభి హటావో అని పిలుపునిచ్చి పేద వారి ఎదుగుదలకు ఎస్ సి, ఎస్ టి వర్గాల అభ్యున్నతి కి ఎంతో కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రవీందర్,ఎం పి  టి సి  సభ్యులు కోవూరు శ్రీనివాస్, పి ఎ సి ఎస్ చైర్మన్ గాజుల రవీందర్, వైస్ చైర్మన్ వెంకటేశం చారి, అధికార ప్రతినిధి వెంకన్న, మండల ఉపాధ్యక్షుడు రాజేశ్, దేవజి ఎస్టి  సెల్ నాయకులు రమేశ్, వశ్రం నాయక్ యువజన కాంగ్రెస్ నాయకులు జలపతి, ఎన్.ఎస్ యు.ఐ నాయకులు హరీష్, సంతోష్, కిషన్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 18 November 2017

హైదరాబాద్ ఇన్ఫోర్ సాఫ్ట్ వెర్ సంస్థ డిజిటల్ సామాగ్రి ఉచిత సరఫరా ; ప్రాధమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభం

 హైదరాబాద్  ఇన్ఫోర్ సాఫ్ట్ వెర్ సంస్థ డిజిటల్ సామాగ్రి ఉచిత సరఫరా 
  • ప్రాధమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభం 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 18 ; :రెబ్బెన మండలం పులికుంట గ్రామంలోని   ప్రాధిమిక పాఠశాల లో..డిజిటల్ తరగతులు ప్రారంభించడo జరిగింది. ప్రధానోపాధ్యాయులు  శ్రీనివాస్ మాట్లాడుతూ  హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్ వేర్..కంపెనీ ఇన్ఫోర్ సాఫ్ట్ వెర్ సంస్థ వారు డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించడానికి అవసరమైన ప్రోజెక్టర్,లాప్టాప్, డిజిటల్ స్క్రీన్. మరియు.ఇతరపరికరాలు..ఉచితంగాఅందచేయడం జరిగిందని అన్నారు. .శనివారంనాడు  కంపెనీప్రతినిధులు.మోహనరావు బాణాల,.బి..సత్యనారాయణ.లు  పాఠశాలకు వచ్చి .ఉపాధ్యాయులు   గ్రామస్థుల సమక్షంలో పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ ప్రారంభించడం.జరిగిందని చెప్పారు.

బండరాయి క్వారీకి పర్యావరణ అనుమతులు మంజూరు

బండరాయి క్వారీకి పర్యావరణ అనుమతులు మంజూరు 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 18 : జిల్లాలోని  కౌటాల మండలం చందారం  గ్రామ  శివారులో గల బండరాయి క్వారీ లీజు మంజూరు చేయుటకు  గాను కావాల్సిన పర్యావరణ అనుమతులను శనివారం జిల్లా పాలనాధికారి  కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చంపాలాల్  జారీ చేయటం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్ గనులు మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు ఈ శ్రీనివాస్ తదితర అధికారులు  పాల్గొన్నారు.

సెర్ప్ ఉద్యోగుల వినూత్న నిరసన

సెర్ప్ ఉద్యోగుల వినూత్న నిరసన 


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 18 : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను  ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ    గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు శనివారం అసిఫాబాద్లో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతుగా జాక్ జిల్లా కన్వీనర్ మోహన్లాల్, కో కన్వీనర్ రమేష్, నాయకులూ రామకృష్ణ, అన్నాజీ, సుఖఃదేవ్,లు   మాట్లాడుతూ ప్రభుతం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యలను సత్వరమేపరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోఉద్యోగులు రమేష్, సురేందర్, శ్రీదేవి, భీం రావు, శకుంతల, సంపత్, రాధ,శంకర్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.  

ఎబివిపి మండల కమిటీ ఎన్నిక

ఎబివిపి మండల కమిటీ ఎన్నిక 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 18 :  ఎబివిపి ఆసిఫాబాద్ మండల  నగర కమిటీని శుక్రవారం ఎన్నిక చేసినట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్  ఎలుగతి  సుచిత్  తెలిపారు.  అసిఫాబాద్ నగర  అధ్యక్షుడిగా కేసరి మహేష్ ,తెలుగునగర కార్యదర్శిగా వైరగడే రమేష్ ,నగర సహాయ కార్యదర్శులుగా సౌయెఫ్ ఖాన్,  ,దెబ్బటి రాజు, నాంది రాజశేఖర్, దెబ్బటి నవీన్, వనవాసీ కన్వీనర్ గా  కొరవుతే  వినయ్ కుమార్,  విద్యార్థి శక్తి ఇంచార్జి గా  లోనార్  మహేష్, ప్రెస్ ఇంచార్జిగ  దాసరి కుమార్ నగర కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్, సాయి, ప్రవీణ్ ,జావిద్ ,సతీష్,మురళి తదితరుల ను ఎన్నుకోవడం  జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వాడై మహీందర్ ,రమేష్, రాజు  తదితరులు పాల్గొన్నారు. 

Friday, 17 November 2017

ప్రాధమిక పాఠశాలా ఉపాధ్యాయులకు సి సి ఎల్ లు మంజూరు

 ప్రాధమిక పాఠశాలా ఉపాధ్యాయులకు సి సి ఎల్ లు మంజూరు 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 :  రెబ్బెన మండలంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎం సి ఆర్ డ్యూటీ చేసిన యాభై అయిదు మంది ఉపాధ్యాయులకు తొమ్మిది సి సి ఎల్ లు   ప్రొసిడింగ్ రూపంలో మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి ఉత్తర్వులు విడుదల చేశారని రెబ్బెన మండల పిఆర్టియు అధ్యక్షుడు సత్తన్నప్రధాన   కార్యదర్శి అనిల్ కార్యదర్శి కురుసింగి శ్రీనివాస్ తెలిపారు ఆరు నెలల లోపుఈ సి సి ఎల్ లువినియోగించుకోవాలని  తెలిపారు.

పంటలకు మద్దతు ధర మరియు సాంకేతిక పరిజ్ఞానం పోస్టర్ల విడుదల

పంటలకు మద్దతు ధర మరియు సాంకేతిక పరిజ్ఞానం పోస్టర్ల విడుదల

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 :  పంటలకు మద్దతు ధర మరియు సాంకేతిక పరిజ్ఞానం అనే పోస్టర్లను  జిల్లా సంయుక్త పాలనాధికారి వి అశోక్ విడుదల చేశారు.  తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ వారి ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానము ప్రవేశపెట్టిందని సరఫరా సంస్థ వారి ఆధ్వర్యంలో ఇందులో భాగంగా కనీస మద్దతు ధరపై రైతుల నుండి కొనుగోలు చేసిన  మధ్య యొక్క విలువలను రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సంయుక్త పాలనాధికారి తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తేవాలన్నారు రైతులకు వరిపంట మద్దతు ధర పొందాలంటే కొనుగోలు కేంద్రంలో రైతు వివరాలు నమోదు చేసుకోవాలని ఆధార్ కార్డు గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం భూమి వివరములు బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్సీ కార్డు, జిరాక్స్, మొబైల్ నెంబర్, బ్యాంకు పాసు పుస్తకము అమలులో ఉన్నట్లు బ్యాంకు వారి ద్వారా ధ్రువీకరణ  ఇవ్వాలన్నారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త తాలు మెట్ట బెడ్డలు రాళ్లు లేకుండా శుభ్రంగా పరుచుకుని తీసుకురావాలని అన్నారు చెడిపోయిన మొలకెత్తిన పురుగులు తిన్న ధాన్యం నాలుగు శాతం మించకుండా ఉన్న ఉండాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రం వారి తూకం వేసి కనీసం మద్దతు ద్వారా క్వింటళు గ్రేడ్ ఏ రకానికి పదిహేను వందల తొంభై కామన్ రకానికి పదిహేను వందల యాభై చొప్పున రైతు ఖాతాల్లో వెంటనే జమ చేయాలన్నారు రైతు సరైన పద్ధతులు పాటిస్తే మద్దతు ధర పొందడానికి సంయుక్త కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సివిల్ జిల్లా మేనేజర్ గోపాల్ డిసిఓ రాంబాన్ జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. 

బీజేపీలో యువత చేరిక

బీజేపీలో యువత చేరిక 
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : కుమరంబీం జిల్లా. రెబ్బెన మండలం. తుంగేడ గ్రామ పంచాయతీ మాధవాయి గూడ, పోతపల్లి గ్రామాల్లో నుండి పలువురు యువత బీజేపీలో చేరారని బీజేపీ జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అకర్శితులై బిజెపి పార్టీలో చేరిన సందర్భంగా  ,. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సప్త దిలిప్. డోబే శ్రీనివాస్. అల్గం శ్రీనివాస్. కోఇరే బాలెశ్. అగ్గీల్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో 80మంది యువకులు పెద్దలు బిజెపిలోచేరారు. . ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్., బిజెపి మండల ప్రదాన కార్యదర్శి మల్రాజు రాంబాబు. అన్నపూర్ణ శాంతి కూమర్ గౌడ్,. బిజెవైయం మండల అధ్యక్షులు ఇగురప సంజివ్ తదితర నాయకులు పాల్గొన్నారు. 



గ్రంధాలయ వారోత్సవాలు

గ్రంధాలయ వారోత్సవాలు 


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 :  గ్రంథాలయ నూటయాభయ్యవ   వారోత్సవాలను పురస్కరించుకొని రెబ్బెన మండల కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించనున్నట్లు  లైబ్రేరియన్ తెలిపారు.  ఈ సందర్భంగా  మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం గ్రంథాలయాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ వారోత్సవాలను నిర్వహించడం  జరుగుతుందని విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి ముగింపు సందర్భంగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా వనమాల మురళి

కాంగ్రెస్ పార్టీ మండల  అధ్యక్షుడిగా వనమాల మురళి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ  రెబ్బెన  మండల  అధ్యక్షుడిగా  మండల కేంద్రానికి చెందిన వనమాల మురళిని నియమించడం జరిగిందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు ఒక ప్రకటనలోతెలిపారు.   సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన  వనమాల జక్కయ్య   కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించడం జరిగిందని ఆయన సేవలకు కొనసాగింపుగా  ఆయన కుమారుడు  మురళిని నియమించడం జరిగిందని అన్నారు.    ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ అధిష్ఠానం తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా నియమించడం  జరిగిందని తనవంతు ఏ  లోటు లేకుండా పార్క్ పటిష్ఠతకు కృషిచేస్తామన్నారు. 

ఎడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహనా కార్యక్రమం

ఎడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహనా కార్యక్రమం 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 : ఎడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై శుక్రవారం రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.   ఈ సందర్భంగా నాబార్డు ఫీల్డ్ ఆఫీసర్ బి అంజన్న నగదు రహిత లావాదేవీల వల్ల ఉభయ ప్రయోజనాలను, మైక్రో ఎటిఎం పనితీరును   మైక్రో ఎటిఎంల వాడకం విధానాన్ని,రూపే కార్డుల వినియోగం తీరును గురించి రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎడిసిసి బ్యాంకు మేనేజర్ సురేష్ కుమార్ సిఇఓ సంతోష్ లతోపాటు పలు రైతులు పాల్గొన్నారు.

డ్రిప్ ఇరిగేషన్ పద్దతి మేలు: జిల్లా ఉద్యానవన అధికారి

డ్రిప్ ఇరిగేషన్ పద్దతి మేలు: జిల్లా ఉద్యానవన అధికారి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 17 :  డ్రిప్ ఇరిగేషన్ పద్దతి  ద్వారా ఉద్యానవన పంటల సాగులో ఆశించిన  ఫలితాలు రాబట్టవచ్చని   జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అభివృద్ధి  సంస్థ అధికారి మెహర్ భాష అన్నారు.  శుక్రవారం రెబ్బెన మండలం  గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల  రైతుల ఉద్యానవన  తోటలలో డ్రిప్ ఇరిగేషన్  పథకం పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా  రైతులతో మాట్లాడుతూ డ్రిప్ పరికరాలు  ఏర్పాటులో సంబంధిత డీలర్లు పనులు సక్రమంగా నిర్వహించారా లేదా అడిగి తెలుసుకున్నారు.  స్వయంగా డ్రిప్ ఏర్పాటు తీరును మరియు  పనిచేస్తున్న విధానాన్ని పరిశీలించి రైతులకు డ్రిప్ ఇరిగేషన్  పై    అవగాహన ఉందా లేదా అని  అడిగి తెలుసుకొన్నారు. రైతులు డ్రిప్పు ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి  తీసుకు రావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఈ పద్దతిని  ఏర్పాటు చేసుకొని మంచిఫలితాలు సాధించారన్నారు.  వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా రైతులు సైతం ముందుకు వస్తే తాము ట్రిపుల్ సిస్టమ్  మంజూరుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఉద్యానవన పంటలపై  రైతులు ఆసక్తి పెంపొందించుకుని వాటిని సద్వినియోగపరచుకొంటే  దీర్ఘకాలికంగా ఆదాయం పొందే అవకాశముందన్నారు ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా ఉద్యానవన అధికారి నదీమ్ కోర్డినేటర్ ఉన్నారు.

Thursday, 16 November 2017

దివ్యంగులకు ప్రోత్సాహం

దివ్యంగులకు ప్రోత్సాహం  
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 16 : జిల్లాలో ఉన్న దివ్యాంగ బధిర అంధ విద్యార్థులను ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని సంక్షేమ శాఖ జిల్లా అధికారి కె సావిత్రి ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.   తాము అందరితో సమానమే అన్న సంకల్పం వారిలో కల్పించేందుకు  వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం ఆలోచించి వారిని ప్రోత్సహించేందుకు ల్యాప్ టాప్లు,స్మార్ట్ ఫోన్లు, అదే విధంగా త్రిచక్ర  సైకిల్స్ ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.  ఈ పథకాలకు జిల్లాలోని డిగ్రీ ఆ పైన చదువుతున్న   వికలాంగ అంధ  బధిర  విద్యార్థులు మాత్రమే అర్హులని ఆమె తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఈ నెల 24 తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకోసం www.tvcc.telangana.gov.in, www.wdsc.telangana.gov.in వెబ్ సైట్ లను చూడవచ్చునని అన్నారు.

Wednesday, 15 November 2017

ఆయుర్వేద వైద్య శిబిరం

ఆయుర్వేద వైద్య  శిబిరం

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 15 :  బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో  మాతా రిసెర్చ్ సెంటర్ హైదరాబాద్ డాక్టర్ విశ్వనాథ్ మహర్షి వారి ఆధ్వర్యంలో గోలేటి టౌన్ షిప్లోని సిఇఆర్ క్లబ్ లో గురువారంనాడు   ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయుర్వేద వైద్య సిబ్బంది శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు.  పిత్తం శ్లేష వాతం అనే మూడు ధాతువులు మానవ శరీరాన్ని పుట్టించి పాలించి నాశనం చేస్తున్నాయని ఈ మూడు ధాతువులు మానవ శరీరంలో సమానంగా ఉండడమే ఆరోగ్యమని హెచ్చుతగ్గులుగా  ఉంటే అనారోగ్యమని ఈ సిద్ధాంత ప్రాతిపదిక మీదనే ఆయుర్వేదం ఈ లోకంలో అవతరించిందని ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాథ్ మహర్షి గారు తెలిపారు దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్లు మోకాళ్ల నొప్పులు బీపీ షుగర్ అజీర్ణము మలబద్ధకము ఆస్తమా స్త్రీల  వ్యాధులకు మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు గోలేటి టౌన్ షిప్ మరియు మాదారం టౌన్షిప్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్మికులు మాజీ కార్మికులు వారి కుటుంబ సభ్యులు గ్రామ సభ్యులు ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిజిఎం పర్సనల్ జె కిరణ్  కోరారు.

తెలంగాణ సమగ్రాభివృద్దే సి పి ఐ ఎజెండా ; సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి కెసిఆర్ కుటుంబపాలన నుండి తెలంగాణను రక్షించుకుందాం

తెలంగాణ సమగ్రాభివృద్దే సి పి ఐ  ఎజెండా ; సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి 
  •  కెసిఆర్ కుటుంబపాలన నుండి తెలంగాణను రక్షించుకుందాం 



  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 15 :  తెలంగాణ సమగ్రాభివృద్దే సి పి ఐ  ఎజెండా అని సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు.  సామజిక తెలంగాణా సమగ్రాభివృద్ధికై  సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి నాయకత్వాన  అక్టోబర్  6 నుండి డిసెంబర్ 3 వరకు సి పి ఐ  చేపట్టిన పోరుబాట యాత్ర  లో భాగంగా బుధవారం కొమురంభీం జిల్లా రెబ్బెనకు చేరుకున్న చాడ వేంకటరెడ్డి మాట్లాడుతూ సకలజనులు ప్రాణాలకు తెగించి కోట్లాడి  సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి,చేసిన హామీలను మరచి,లక్ష ఉద్యోగాలనిచెప్పి, తన కుటుంబపాలన సాగిస్తున్నకెసిఆర్ కు తగిన బుడ్డి చెప్పాల్సిన సమయం వచ్చిందని  రాబోయే ఎన్నికలలో కెసిఆర్ ను గద్దెదింపి తెలంగాణను రక్షించుకుందామని  అన్నారు. తమ న్యాయమైన కోరికలకు ఉద్యమాలు చేస్తున్న వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్త్రికరిస్తున్నారని, దళితులకు మూడు ఎకరాలని  ,కేజీ  టు పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగమని,పంటల నష్టపరిహారమని, చెప్పి ఇపుడు ఆ విషయమే మరిచి ప్రజల దృష్టిని మరల్చడానికి గొర్రెలని, బర్రెలని కల్లబొల్లి మాటలు చెపుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలు పెద్ద  స్కాములని  అన్నారు. రేషన్ షాపులవ్యవస్థను   నిర్వీర్యపరచి పేదలకందే బియ్యాన్ని అందకుండా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ శాసనసభ్యులు గుండా మల్లేష్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేష్, పశ్యపద్మ, ఎఐవైఏఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు యాదవ్, కార్యదర్శి అనిల్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు తిరుపతి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జగ్గయ్య,శంకర్,ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,డివిజన్ కార్యదర్శి పూదరి సాయి,మండల అధ్యక్షుడు మహిపాల్, కార్యదర్శి పర్వతి సాయి తదితరులు పాల్గొన్నారు.

తెరాస కార్యకర్తలకే డబల్ బెడ్ రూమ్ పథకమా: బీజేపీ జిల్లా అధ్యక్షులు జేబి పౌడెల్

తెరాస కార్యకర్తలకే డబల్ బెడ్ రూమ్ పథకమా: బీజేపీ జిల్లా అధ్యక్షులు జేబి  పౌడెల్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 15 :   ఆసిఫాబాద్ నియోజకవర్గ  ఎమ్మెల్యే కోవలక్ష్మి తెరాస కార్యకర్తలకే డబుల్ బెడిరూం ఇండ్లు ఇస్తామని  బిజెపి జెండా పట్టుకున్న వాళ్లకి ఇవ్వనని వాంకిడి లో  జరిగిన టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో అనటం సబబు కాదని బీజేపీ  జిల్లా అధ్యక్షుడు  జెపి పడేల్ అన్నారు. రెబ్బెన మండలం  గోలేటి భారతీయ జనతా పార్టీ  జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడారు డబల్ బెడ్ రూములు కాలనీకు కెసిఆర్ కాలనీ అని  పేరు పెట్టటం పట్ల మేము ఊరుకోమని కేంద్ర ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు ఎన్నో నిధులు ప్రధాని  నరేంద్రమోడీ కేటాయిస్తున్నారని  ఆ విషయాలను బయట పెట్టకుండా మేమే  చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలకు తెలుసు ఆ ప్రజలే నిర్ణయిస్తారు రెండు వేల పందొమ్మిదిలో  జరిగే ఎన్నికల్లో బిజెపి పై స్థానంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని ఎదుర్కోలేక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన అన్నారు.  ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ సుధాకర్ అసెంబ్లీ కన్వీనర్ గుల్మం చక్రపాణి సుదర్శన్ గౌడ్, సంతోష్, రాజేందర్ మరియు  తదితరులు  పాల్గొన్నారు.