రైతు సమస్యల పరిష్కారంకోసం రైతు సమన్వయ కమిటీలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ; గ్రామాలలో రైతులుఎదుర్కుంటున్నఅనేకసమస్యలకు గ్రామ రైతు సమన్వయ కమిటీలు పరిష్కారం చూపుతాయని ఎం ఎల్ సీ పురాణం సతీష్ కుమార్ అన్నారు, రెబ్బెన మండలం కిష్టాపూర్,నార్లాపూర్, గంగాపూర్ , తుంగేడ నవేగం, రెబ్బెన గ్రామాలలో పర్యటించి రైతు సమన్వయ కమిటీలపై అవగాహన కల్పించారు. ప్రతి గ్రామం,జిల్లాల వారీగా సమన్వయకమిటీలు ఏర్పాటుచేసుకున్నట్లైతే పంటలపై అవగాహనపెరుగుతుందని ,ఒకే పంట కాకుండా వివిధ రకాల అధిక దిగుబడినిచ్చే పంటలను వేసుకోవచ్చని అన్నారు. రైతుల సంక్షేమం కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టులు, ఎకరానికి నాలుగువేల రూపాయలు వంటి పథకాలతో రైతులకు వ్యవసాయం భారం కాకుండా టి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచిందని చెప్పారు. .పండించిన పంటలకు ,తగిన గిట్టుబాటు ధరలను కల్పించుకోవడలోను ఈ రైతు సమన్వయ కమిటీలు ఎంతో ప్రాధాన్యం వహిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి పి సంజీవకుమార్, జెడ్ పి టి సీ బాబు రావు , ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ , మండల టి ఆర్ ఎస్ అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి , ఆయాగ్రామాల సర్పంచులు తదితర నాయకులూ,గ్రామాల రైతులు పాల్గొన్నారు. .
No comments:
Post a Comment