ఘనంగా గురుపూజోత్సవం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 05 : రెబ్బెనలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఉన్నతపాఠశాలు మరియు పాఠశాలల లో ఈ రోజు గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు భారతరత్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకొని ఆయన జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన ఇరవైఒక్కటవ యేట ప్రొఫెసర్ గా తన ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఈ దేశానికీ సేవలందించడమే కాకుండా విద్యాసంస్కరణలపై ద్రుష్టి పెట్టి పలు సూచనలు చేసారు. ఆయన సేవలను గుర్తించి ప్రతియేటాఆయన జన్మదినమైన సెప్టెంబర్ ఐదవ తారీఖున టీచర్స్ డే గ నిర్వహించుకుంటున్నాము.
No comments:
Post a Comment