Sunday, 17 September 2017

విశ్వకర్మ జయంతోత్సవాలు

  విశ్వకర్మ జయంతోత్సవాలు 

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 17 ;      భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి  సందర్భంగా  రెబ్బెన మండలం  గోలేటి టౌన్ షిప్ లో ఆదివారంనాడు  ఘనంగా నిర్వహించారు.   ఈ ఉత్సవానికి మండలంలోని అన్నిప్రాంతాల విశ్వబ్రాహ్మణులు సకుటుంబంగా  పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. . ఉదయం 10 గంటలకు విశ్వకర్మ ధ్వజం వేదోక్తంగా ఆవిష్కరించి,పూజాది  కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా భక్తులు మంగళ హారతులతో సామూహిక పూజలు నిర్వహించారు.  జిల్లా విశ్వకర్మ కన్వీనర్ పంచలపు లక్ష్మణాచారి పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో. జిల్లా కో కన్వీనర్ ఎం సదాశివాచారి సింగల్ విండో వైస్ చైర్మన్ వెలువోజు వెంకటేశం చారి, , కే రవీంద్రాచారి, వెంకటేశం చారి, శంకర్ చారి, రామయ్య చారి, తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment