గ్రామపంచాయతీ ఉద్యోగుల పోస్ట్ కార్డు బాట
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన సెప్టెంబర్ 11 ; గ్రామపంచాయితీ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సత్వరమే స్పందించాలని కోరుతూ సోమవారం రెబ్బెన మండలంలోని పన్నెండు పంచాయతీలలో పనిచేసే ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి కి పోస్ట్ కార్డు ద్వారా, తమ నిరసనను తెలియచేస్తూ పోస్టుకార్డులను రెబ్బెన పోస్ట్ ఆఫీసులో అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ యూనియన్ ఉపాధ్యక్షులు ఎన్ సుధాకర్, కె. తిరుపతి, వెంకటేష్ ,ధర్మైయ్య, దేవాజి,విజయ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment