అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 15 ; కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో గందరగోళం సృష్టిస్తూన్న అధికారులపై చర్యలు తీసుకొవాలని కేజీబీవీల రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కిషన్ కు శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, పి డి యస్ యు జిల్లా ఇంచార్జ్ పాపారావు, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా ఇంచార్జ్ కోట్నాక గణపతిలు మాట్లాడుతూ జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్.పి.డి ని కోరారు. గత రెండు నెలల నుండి జిల్లాలోని కొన్ని కేజీబీవీ పాఠశాలల్లో ఆందోళనలు జరుగుతుంటే సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నిరేత్తినట్టుగా వ్యవహరిస్తూన్నరని అన్నారు. సిర్పూర్ (యు) కేజీబీవీ నుండి కౌటాల కేజీబీవీకి బదిలీ ఐన సీఆర్టీలు విధుల్లో చేరకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. అధికారుల ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకొవాల్సిన అధికారులు చర్యలు తీసుకోకుండా వారు కోరుకున్న చోటు జైనూర్ కేజీబీవీకి బదిలీ చేశారని ఆరోపించారు. జైనూర్ కేజీబీవీ నుండి సిర్పూర్( యు) కు బదిలీపై రావాల్సిన సీఆర్టీలు రాకుండా ఉండడంతో మళ్లీ సిర్పూర్ (యు) కి బదిలీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకొవాల్సిన అధికారులు వారిని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని అన్నారు. రెండు నెలల్లో అధికారులు నాలుగు బదిలీల ఉత్తర్వులు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలల్లో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకొవాలని అలాగే గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో నిరహర దీక్ష చేస్తామని దీనికి పూర్తి బధ్యత అధికారులే వహించాలని హెచ్చరించారు.
No comments:
Post a Comment