Wednesday, 27 September 2017

సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో తెరాస పతనం ఖాయం ; కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పిఎస్ఆర్

సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో  తెరాస పతనం ఖాయం 
                   కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పిఎస్ఆర్ 

   కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 26 :    సింగరేణిలో గత   ఎన్నికల్లో సెంటిమెంటును అడ్డంపెట్టుకొని గెలుపొందిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా  ఉండి సింగరేణి కార్మికుల హక్కులను సర్వ నాశనం చేసిందని, సంస్థను కార్మికులే కాపాడుకోవలసిన పరిస్థితి నెలకొన్నదని ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు అన్నారు. మంగళవారం రాత్రి రెబ్బన బెల్లంపల్లి ఏరియా  గోలేటిటౌన్ షిప్ లోని   సీఈఆర్ క్లబ్ లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసి కార్మిక సంఘాల  జనరల్ బాడి సమావేశంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొని  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తూ,అప్రజాస్వామిక పాలనను రుచి చూపిస్తున్నారని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు టి.నర్సింహాన్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థలు  తాడిచర్ల-1, తాడిచర్ల-2 బ్లాకులను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు  పన్నగా జాతీయ సంఘాలు దానిని గమనించి అనేక పోరాటాలు చేసి  అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఆగిందన్నారు. అక్టోబర్ 5 న జరగబోయే గుర్తింపు ఎన్నికల్లో తెబొగకాసంను  గెలిపిస్తే సింగరేణి ప్రైవేటు పరం కావటం కాయం అన్నారు. సింగరేణి సీఎండీ గ ఉన్న శ్రీధర్ కేసీఆర్కు గుమస్తాగా మారారని విమర్శించారు . గడిచిన మూడేళ్లలో  సింగరేణి వ్యాప్తంగా 30మంది కార్మికులు గని ప్రమాదంలో మృతి చెందిన ఏ ఒక్క కార్మికుని కుటుంబాన్ని పరామర్శించేందుకు సీ అండ్ ఎండీకి తీరలేదన్నారు.  2012 లో వారసత్వ ఉద్యోగాల  పేరుతో గెలిచినా టీబీజీకేఎస్ దొంగ నోటిఫికేషన్ లతో కార్మికులను మోసం చేసిందన్నారు. టీబీజీకేఎస్ నాయకులూ గనుల ఫై వెళ్లే మొకం లేక ఎంపీలు, ఎమ్మెల్యే లతో,  తెరాస కార్యకర్తలతో మీటింగ్ లు  పెట్టిస్తున్నారని అన్నారు, తెరాస ప్రభుత్వం భూగర్భ గనులను మూసివేసి ఓసిపిలను ఏర్పాటు చేస్తూ కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. సీఎం కేసీర్ చెప్పే మాటలకూ చేసే పనులకు ఎక్కడ పొంతన లేదన్నారు. గుర్తింపు ఎన్నికల్లో ఓట్లతో గెలిచే సత్తా దమ్ము లేక నోట్లు పట్టుకొని ఎంపీలు, ఎమ్మెల్యేలు  గనులపై తిరుగుతున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం ,టీబీజీకేఎస్ ఎన్ని ప్రబావాలకు గురి చేసిన కార్మిక వర్గం ఎర్ర జెండా వైపే ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సీసీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుండా మల్లేష్, ఏఐటీయూసీ  రాష్ట్ర కార్యదర్శి బోసు ,సిపిఐ జిల్లా కార్యదర్శులు బద్రి  సత్యనారాయణ, కలవేణి శంకర్,డీసీసీ ప్రధాన కార్యదర్శి విశ్వ ప్రసాద్ రావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలేష్ గౌడ్ ,ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్ర్షి  ఎస్.తిరుపతి, ఐఎన్టీయూసీ  ఏరియా ఉపాధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment