Monday, 11 September 2017

ప్రొఫెసర్ కోదండరాం అమరవీరుల స్ఫూర్తి యాత్ర కు తెలుగు దేశం మద్దతు: సొల్లు లక్ష్మి

ప్రొఫెసర్ కోదండరాం అమరవీరుల స్ఫూర్తి యాత్ర కు  తెలుగు దేశం   మద్దతు:  సొల్లు   లక్ష్మి 
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  సెప్టెంబర్ 11 ; ప్రజాసమస్యలపై పార్టీలకతీతంగా ప్రజలకోసం నిజమైన తెలంగాణకోసం నిరంతరం పరిశ్రమిస్తున్న కోదండరాం  తల  పెట్టిన అమరవీరుల స్ఫూర్తి యాత్ర కు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కొమురం భీం జిల్లా  తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మీ అన్నారు. సోమవారం  రెబ్బెన మండలంలోని విశ్రాంతి భవనంలో మాట్లాడుతూ, యాత్రలో భాగంగా రెబ్బెన కు విచ్చేస్తున్న   కోదండరాంకు తమ పూర్తి మద్దతు ఉంటుందని,  తెలియచేసారు. రైతు సమన్వయ సమితులు ఏర్పాటులో కేవలం అధికారపార్టీ కార్యకర్తలను    మాత్రమే నామినెటే చేస్తున్నారని ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని దీనిపై జిల్లా వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సతీష్,విజయ్, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment