చేయూత యూత్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.5 కే భోజనం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) సెప్టెంబర్ 25 : చేయూత యూత్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.5 కే భోజనం కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రారంభించారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాడుల కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీదారులకు తమవంతుసాయంగా చేయూత యూత్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైరాగరే ప్రతాప్, నాగపురి తిరుపతి నరే రాజేందర్, పెద్దింటి రాకేష్ , సామల అమర్, జంజీరాల శ్రీనివాస్, కుర్ర రమేష్, ముద్దపల్లి సాయి కృష్ణ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment