Monday, 18 September 2017

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరలు : ఎమ్మెల్యే కోవాలక్ష్మి

బతుకమ్మ  పండుగ సందర్భంగా   ఆడపడుచులకు చీరలు : ఎమ్మెల్యే  కోవాలక్ష్మి

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  సెప్టెంబర్ 18 ; ప్రకృతిని పూజించే పండుగ అయిన బతుకమ్మ పండుగను టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి   ఆడపడుచులకు చీరలు పంపిణీని చేసినట్లు   ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి,  ,జిల్లా కలెక్టర్  చంపాలాల్ అన్నారు. సోమవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో భాగంగా కొమురంభీం  ఆసిఫాబాద్ జిల్లాలో చిరలాపంపిణీ ఘనంగా  నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కేంద్రాల్లో మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, గ్రామాల్లో సర్పంచ్ లు చీరల పంపిణీ ప్రారంభించారు.ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట,సందీప్ నగర్ , రాపెల్లి, తుంపల్లి, ఋరుగూడ, ఎల్లారం, అంకుశపూర్ ,రెబ్బెనలలో  ఎం ఎల్ ఏ  పంపిణీని ప్రారంభించారు.   ఈ సందర్భంగా  ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ.. పేదింట పుష్పాల పండుగ .. నిరుపేద కుటుంబాల వారు కూడా ఈ పండుగను అపూర్వంగా జరుపుకుంటారని ,ఉమ్మడి రాష్ట్రంలో మన పండుగలకు తగిన గుర్తింపు ఉండేదికాదని , . . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పండుగలకు ప్రాధాన్యం పెరుగుతున్నదాని,  బతుకమ్మ పండుగ ఆడపడుచులకు పెద్ద పండుగ.అని, తెలంగాణ ప్రభుత్వం ముఖ్య మంత్రి కే సి ఆర్ నాయకత్వంలో  అధికారికంగా బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహిస్తున్నదని అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు దగ్గరవుతూ వారి పండుగలను పురస్కరించుకుని నిధులు విడుదల చేసి శభాష్ అనిపించుకుటుందని, ఈ పండుగకు ఆడపడుచులకు కుల,మాత  వైవిధ్యం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికి తలా ఒక చేనేత చీరను పండుగ కానుకగా అందచేస్తున్నామని తెలిపారు. . ఈ కార్యక్రమాలలో ఆసిఫాబాద్  పి  డి  శంకర్,, ఎంపి  డి ఓ  శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ గంధం శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, రెబ్బెనలో జపిటిసీ అజమీర బాబురావు, ఎంపిపి కర్నాధం సంజీవ్ కుమార్, సర్పంచులు పెసర, వెంకటమ్మ, గజ్జెల సుశీల, ఉప సర్పంచ్ బి శ్రీధర్ కుమార్, ఎం ఫ టి సి వనజ, పంచాయతీ సెక్రటరీ మురళీధర్, సింగల్ విండో చైర్మన్ మధునయ్య, చిరంజీవే, మడ్డి  శ్రీనివాస్, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment